మా బంధానికి ‘బూతు’ ఆపాదించొద్దన్న హీరోయిన్
ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతున్న తార కత్రినా కైఫ్. కత్రినా బాలీవుడ్ కి పరిచయం కావడానికి, ఇప్పడు ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం స్టార్ హీరో సల్మాన్ ఖానే. సాధారణంగా ఒక హీరో..మరొక హీరోయిన్ పట్ల ఎక్కవ కేర్ తీసుకుంటున్నాడంటే ఇద్దరి మధ్య ఏదో 'సం"బంధం ఉందని గుస గుసలాడుకోవడం సినిమా సర్కిల్స్ లో కామన్. వేరే వారి విషయంలో ఏమో కానీ...మా బంధానికి మాత్రం బూతు(అపవిత్రత) అపాదించొద్దు అని అంటోంది కత్రినా కైఫ్.
'నేను నటిగా అందరి అభిమానాన్ని పొందుతున్నాను అంటే దానికి కారణం సల్మానే. తనతో నాకున్న అనుబంధం స్నేహం కంటే గొప్పది. దయచేసి మా బంధానికి అపవిత్రతను అపాదించొద్దు..అంటూ మీడియా ముందు వాపోయింది కత్రినా. ఇద్దరిపై మీడియాలో వస్తున్న వివిధ కథనాల నేపథ్యంలో కత్రినా ఈ ప్రకటన చేసింది. సల్మాన్ నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి. మా మధ్య ప్రేమ బంధంగానీ, మీడియాలో వస్తున్నట్లు మరేదో బంధం లాంటిది ఏమీ లేదు. సల్మాన్ తో ఒకప్పుడు లభిప్రాయ బేధాలు రావడం సహజమే. ఇతర స్నేహితుల్లానే మేము కూడా అప్పుడప్పుడు గొడవ పడతాం..మళ్లీ కలిసుంటాం. ఇందులో మీడియా వారికి వచ్చిన అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదు అంటూ...సినిమా జర్నలిస్టులకు చురకలంటించింది.


Click it and Unblock the Notifications











