బాత్రూమ్‌లో కెమెరాలు పెట్టి వీడియోలా? నటి రోజా హాట్ కామెంట్స్
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. విద్యార్ధినులు అర్ధరాత్రి పూట రోడ్డెక్కడం, తమ వీడియోలను ఓ విద్యార్ధి అమ్ముకుంటున్నాడంటూ ఆరోపించడం చర్చనీయాంశమైంది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై స్పందించి , దర్యాప్తుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ ఘటనతో పాటు ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సినీనటి, మాజీ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్ధి .. లేడీస్ బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి, అందులోని వీడియోలను విక్రయిస్తున్నాడంటూ విద్యార్ధినులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. యాజమాన్యం దృష్టికి వచ్చినా వారు స్పందించలేదంటూ విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశం కావడంతో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.

గుడ్లవల్లేరు కాలేజీలో విద్యార్ధినుల ఆందోళనలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి చెప్పారు. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హెచ్చరించారు. రాష్ట్రంలోని కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు వంటివి చోటు చేసుకోకుండా కళాశాలలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కృష్ణా జిల్లా ఎస్పీ సైతం సీక్రెట్ కెమెరాల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు గుడ్లవల్లేరు ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర, పార్టీ ఎమ్మెల్యేలను కళాశాల వద్దకు వెళ్లి పరిస్ధితిని సమీక్షించాలని ఆయన ఆదేశించారు. విద్యార్ధినుల ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని పటిష్ట దర్యాప్తు జరపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యార్ధినుల వద్ద ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని సీఎం సూచించారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు అధైర్యపడొద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
మరోవైపు సీక్రెట్ కెమెరాల ఘటనపై మాజీ మంత్రి, సినీనటి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు తప్పు చేయాలంటే నేరస్థులు భయపడేవారని, ఇప్పుడు వారికి కొమ్ములొచ్చాయని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు ఆంధ్రప్రదేశ్‌లో భద్రత కరువైందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరస్థులకు ధైర్యం వచ్చిందని రోజా ఫైర్ అయ్యారు. ఇంజనీరింగ్ కళాశాలల్లోని గర్ల్స్ బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితలకు సమయం లేదా అని రోజా ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











