కేకపుట్టించే డైలాగ్స్ తో వస్తున్న‘రెబల్’
ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వం వస్తున్న తాజా సినిమా 'రెబల్". ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే మరో సంచలన మూవీగా తెరకెక్కబోతోంది. గతంలో ప్రభాస్ హీరోగా సూపర్ హిట్ మూవీ ఛత్రపతి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ అదిరిపోయే డైలాగ్స్ తో అభిమానులతో విజిల్స్ వేయించాడు. 'వాడు పోతే వీడు...వీడు పోతే నేను...నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే...అప్పల్నాయుడు దాదా గిరి కొచ్చినా...దౌర్జన్యానికొచ్చినా.." లాంటి ఎమోషనల్ డైలాగ్స్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే.
'రెబల్" చిత్రంలో కూడా అలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చాలా ఉండబోతున్నాయి. దర్శకుడు రాఘవ లారెన్స్ ముఖ్యంగా ఇలాంటి డైలాగ్స్ పై ప్రత్యేక దృష్టి సారించాడు. ఈ చిత్రంలో కూడా 'నాకు అమ్మాయిలన్నా, సెల్‌ఫోన్‌లన్నా ఇష్టముండవు. సెల్‌ఫోన్‌లో మెసేజ్ ఎక్కువ.. అమ్మాయిల్లో డౌట్స్ ఎక్కువ. ఏవీ మనకి సెట్ కావు... నాకు రామాయణం, మహాభారతాల గురించి తెలియదు. అందులో వుండే యుద్దాల గురించి తెలుసు రండి కుమ్మేసుకుందాం...!! లాంటి డైలాగ్స్‌తో ప్రభాస్ మరోసారి అభిమానుల్ని ఉర్రూతలూగించనున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ లో రెబల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











