పవన్ దూరం: మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కో బాధ్యత...(పూర్తి డీటేల్స్)

By Bojja Kumar

హైదరాబాద్: చిరంజీవి సినీ జీవితంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆయన తాజాగానటిస్తున్న 150వ చిత్రం. మెగాస్టార్ కు ఠాగూర్ లాంటి భారీ విజయాన్ని అందించిన వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

దర్శకుడు వివి వినాయక్ మెగా అభిమానులు, ప్రేక్షకులును ఊహించిన దానికంటే ఎక్కువగానే హ్యాండ్సమ్ గా 150వ సినిమాలో చూపించబోతున్నారు. చిరంజీవి అంటేనే కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు ఆయన తెలుగు తెరపై తనదైన స్టైల్, డాన్స్, యాక్షన్స్ తో అదరగొట్టారు. ఆయన 150వ సినిమా కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతోంది. తమిళంలో హిట్టయిన కత్తి చిత్రానికి రీమేక్ గా ఈచిత్రం తెరకెక్కుతోంది.

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో చిరంజీవి 150వ సినిమా గురించి అయినంత చర్చ ఏ సినిమా గురించి లేదంటే సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు మూడేళ్ల పాటు చర్చల్లో ఉన్న ఈ చిత్రం ఇటీవల ఎట్టకేలకు ప్రారంభం అయింది.

ఈ సినిమా ప్రత్యేక కేవలం చిరంజీవి 150వ సినిమా అని మాత్రమే కాదు....ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తలా ఒక బాధ్యత నిర్వహిస్తూ సినిమాలో భాగం అవుతున్నారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాత బాధ్యత నిర్వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ సీన్లో రామ్ చరణ్ నాన్నతో కలిసి కనిపించే అవకాశం ఉంది.

మెగా ఫ్యామిలీకి చెందిన ఇతర స్టార్లు సినిమాలో ఏయే బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయాలు స్లైడ్ షోలో....

రామ్ చరణ్

రామ్ చరణ్

చిరు తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ చిన్న పాత్రలో నటిస్తున్నాడు.

సుస్మిత

సుస్మిత

చిరు పెద్ద కుమార్తె సుస్మిత ఈ చిత్ర సాంకేతిక నిపుణుల జాబితాలో చోటు దక్కించుకొందని తెలుస్తోంది. స్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తోందని సమాచారం. గతంలో ‘శంకర్‌దాదా జిందాబాద్‌'కీ సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది.

సురేఖ

సురేఖ

సతీమణి సురేఖ ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.

చిన్న కూతురు

చిన్న కూతురు

త్వరలో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలనే ఆలోచనలో ఉన్న చిన్న కూతురు శ్రీజ.... ప్రొడక్షన్ కు సంబంధించిన వ్యవహారాల్లో పాలు పంచుకుంటోందని, ఈ అనుభవం త్వరలో తాను స్థాపించబోయే సొంతబేనర్ విషయంలో ఉగయోగపడుతుందనే ఆలోచనతో ఈ వ్యవహారాలు చూసుకుంటోందట.

అల్లు అరవింద్

అల్లు అరవింద్

తెలుగులో టాప్ నిర్మాతగా పేరొందిన చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీలైనన్ని ఎక్కువ సెంటర్లలో మంచి థియేటర్లను ఎంపిక చేసే పనిలో ఉన్నారట.

నాగబాబు

నాగబాబు

మొదటి నుండి మెగా అభిమానుల వ్యవహారం అంతా నాగబాబు చూసుకుంటున్నారు. చిరంజీవి 150వ సినిమా రిలీజ్ సమయంలో అభిమాన సంఘాలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, సినిమా భారీ విజయం సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలు వేయాలి అనే బాధ్యత ఆయన చూసుకుంటున్నారట.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

చిరంజీవి 150వ సినిమాలో అల్లు అర్జున్ ఓ పాటలో చిరంజీవితో కలిసి అదిరిపోయే స్టెప్స్ వేయబోతున్నారు.

సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌

సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌

సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ కూడా ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాలో కనిపించే అవకాశం లేదని, ఆయన ఈ విషయాలకు దూరంగానే ఉంటున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X