twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంకుల్ పాత్ర అయినా ఓకే అంటున్న కుర్ర హీరో

    By Srikanya
    |

    ఇన్నాళ్లూ లవర్‌బాయ్‌గా కుర్రకారును ఉర్రూతలూగించిన అభయ్ డియోల్ కొత్త వేషానికి మారుతున్నాడు.బాలీవుడ్ లో అభయ్ డియోల్ వైవిధ్యమైన చిత్రాలకు, పాత్రలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం 'షాంఘై" కోసం యూత్ లుక్‌ను త్యాగం చేసి 40 ఏళ్ల ఐఏఎస్ అధికారిగా కనిపించడానికి తయారవుతున్నాడు. దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ రాజకీయ చిత్రాన్ని 1966లో వచ్చిన గ్రీకు నవల 'జెడ్" ఆధారంగా తీస్తున్నారు. విధుల నిర్వహణలో వివిధ వర్గాల నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొనే దక్షిణాది ప్రభుత్వ అధికారిగా అభయ్ కనిపిస్తున్నాడు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,.,'దిబాకర్ శైలి నాకు ఎంతోగానో నచ్చుతుంది. ఆయన దర్శకత్వంలో ఓయ్ లకీ లకీ ఓయ్‌లో నటించడం సంతోషాన్నిచ్చింది. నటుడిగా సవాళ్లను ఎదుర్కోవాల్సిందే కాబట్టి మధ్య వయస్కుడిగా కనిపించడానికి సంకోచించలేదు" అని అభయ్ స్పష్టం చేశాడు. అలాగే సామాన్యుడి స్వప్నాలు, ఆకాంక్షలను షాంఘై ప్రతిబింబిస్తుందని అభయ్ చెబుతున్నాడు.

    'సమకాలిన అంశాలనే చూపించినా, ఈ సినిమా పూర్తి వైవిధ్యభరితంగా ఉంటుంది. జీవితంలో నాణ్యత పెరగాలని మనందరం ఎంతగా కోరుకుంటామో ఇందులో స్పష్టంగా చూపిస్తాం. మంచి రోడ్లు, సదుపాయాలు కావాలని ఆశిస్తాం. ఇదంతా చెప్పడానికి బాగానే ఉన్నా చేసి చూపించడం కష్టమే!" అని అన్నాడు. భిన్నమైన పాత్రలకు అభయ్ పెట్టిందిపేరు. పాత్రను ఎంచుకోవడానికి ప్రత్యేక నియమాలేమీ పెట్టుకునే మనిషిని కాదని అభయ్ అంటున్నాడు. 'ఉదాహరణకు మనోరమ-సిక్స్ ఫీట్ అండర్ సినిమానే తీసుకుంటే.. అది గంభీరంగా అనిపించే సున్నితమైన సినిమా. తరువాత ఏక్ చాలిస్ కీ లోకల్ ట్రైన్-ఇది కామెడీ. తరువాత వచ్చిన సోచా నా థా హాస్యప్రేమకథా చిత్రం. దేవ్ డీలో పూర్తి నాటకీయత ఉంటుంది. ఇవన్నీ ఒకదానితో ఇంకోదానికి సంబంధం లేని సినిమాలు. వీటన్నింటిలోనూ రెండు ఉమ్మడి విషయాలు ఉన్నాయి. మంచి కథ, గట్టిపాత్రలు"అని అభయ్ డియోల్ వివరించాడు. ఇటీవల విడుదలైన జిందగీ నా మిలే దోబారా హిట్ సాధించడంతో ప్రస్తుతం ఈ 35 ఏళ్ల నటుడు ఖుషీ ఖుషీగా ఉన్నాడు. ఇందులో హృతిక్ రోషన్, కత్రినాకైఫ్, ఇమ్రాన్ హష్మీ, కల్కీ కోచ్లిన్ ముఖ్యపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

    English summary
    Abhay Deol is looking forward to playing a 40-year-old IAS officer in Dibakar Banerjee's upcoming political thriller 'Shanghai', an adaptation of Greek author Vassilis Vassilikos 1966 novel 'Z'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X