twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల తాజా చిత్రం బిజినెస్ పొజీషన్

    By Srikanya
    |

    ఇప్పుడు మార్కెట్లో అందరి దృష్టీ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంపైనే ఉంది. తక్కువ బడ్దెట్ లో తీసే శేఖర్ కమ్ముల సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కీ, ఎగ్జిబిటిర్స్ కి రెగ్యులర్ గా ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతూండటంతో ఈ చిత్రం రైట్స్ కోసం మంచి పోటీ ఏర్పడినట్లు సమచారం. ముఖ్యంగా ఓవర్ సీస్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సిటీల్లోనూ ఎగ్జిబిటర్స్ కూడా ఈ చిత్రం విడుదలపై ఆసక్తి చూపెడుతున్నారు. మినిమం గ్యారెంటీ సినిమాలుగా వారు అభివర్ణించి,ఈ సినిమా రైట్స్ కోసం ఎగబడుతున్నారు. ప్రసుతం ఈ మేరకు శేఖర్ కమ్ముల బిజినెస్ ఎంక్వైరీలతో మాట్లాడుతూ ఫైనలైజ్ చేస్తున్నారు.

    ఇక ఈ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'ని సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రాలతో కలిపి కాకుండా, జనవరి 26న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' తో అందరూ కొత్త వాళ్లతో ఆయన రూపొందించే ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది.ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంభందించి ఓ స్టిల్ కానీ,టీజర్ కానీ విడుదల చేయకపోయినా మంచి క్రేజ్ ఉంది. ఈ విషయమై శేఖర్...మాట్లాడుతూ..లీడర్‌ తరవాత ఎలాంటి కథ చేయాలి? అని ఆలోచించాను. మళ్లీ 'ఆనంద్‌', 'హ్యాపీడేస్‌' లాంటి సినిమా కావాలి అనిపించింది. వాటిలో జీవితం గురించి చెప్పాం. ఆ అనుభూతుల్ని మరోసారి చూపిద్దాం అనిపించింది. స్టార్స్‌ తో సినిమా తీయొచ్చు. కానీ ఈ కథకి కొత్తవాళ్లయితే బావుంటుంది. అందుకే ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల కోసం అన్వేషిస్తున్నాం. సిక్స్‌ప్యాక్ ‌లూ, ప్రపంచ సుందర్లూ అక్కర్లెద్దు. కథకు సరిపడేలా సహజంగా ఉంటే చాలు అన్నారు. ఇక ఈ చిత్రం కూడా యువతరాన్ని టార్గెట్ తీసారని తెలుస్తోంది.

    English summary
    Life Is Beautiful gets exciting business inquiries are already vogue in market.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X