»   » అల్లరి నరేష్ పెళ్లాడబోయే అమ్మాయి ఈవిడే (ఫోటో)

అల్లరి నరేష్ పెళ్లాడబోయే అమ్మాయి ఈవిడే (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అల్లరి నరేష్ పెళ్లి సెటిలైన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన విరూప అనే అమ్మాయిని నరేష్ పెళ్లాడబోతున్నాడు. ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫ్పిల్డ్ నుండి గ్రాజ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఆర్కిటెక్టుగా పని చేస్తోంది.

తాజాగా విరూప ఫోటో ఫిల్మీబీట్ మీకు ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది. ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి. అల్లరోడికి తగిన జోడీగా ఉంది కదూ ఈ అమ్మాయి. ఫిల్మీబీట్ తరుపున అల్లరి నరేష్‌కు కంగ్రాట్స్ చెబుదాం. ఈ రోజు(మే 1) సాయంత్రం చెన్నైలోని లీలా ప్యాలెస్ లో నిశ్చితార్థం జరుగనుంది. మే 29 రాత్రి 9 గంటలకు పెళ్లి ముహూర్తం ఫిక్సయింది. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వివాహం జరుగబోతోంది.

EXCLUSIVE: Allari Naresh Fiance Virupa Revealed

అల్లరి నరేష్ కు తగిన జోడీ కోసం గత కొన్ని నెలలుగా కుటుంబ సభ్యులు అన్వేషణ సాగిస్తున్నారు. అయితే అందుకు సంబంధించిన విషయాలేవీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. నిశ్చిర్థం ఫిక్సయ్యే వరకు అంతా గోప్యత పాటించారు. ఎట్టకేలు ఈ విషయం బయటకు రావడంతో నరేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అల్లరి నరేష్ సినిమాల విషయానికొస్తే....గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో బాక్సాఫీసును తన కామెడీ పంచ్ లతో హోరెత్తించిన అల్లరి నరేష్ జోరు ప్రస్తుతం కాస్త తగ్గింది. త్వరలో అల్లరి నరేష్ ఎకె ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ‘జేమ్స్ బాండ్...నేను కాదు నా పెళ్లాం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అల్లరి నరేష్ కెరీర్లో ఇది 49వ సినిమా. పార్టీలు పబ్బులూ అంటూ తిరిగే మోడ్రన్ అమ్మాయి అవసరం లేదని, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా చక్కబెట్టే సాంప్రదాయ బద్దమైన అమ్మాయి కావాలని అల్లరి నరేష్ కోరుకున్నాడు. ఇపుడు అలాంటి అమ్మాయే దొరకడంతో అల్లరి నరేష్ చాలా హ్యాపీగా ఉన్నాడట.

English summary
The 32-year-old actor, Allari Naresh, is all set to get hitched. Last year, when the actor's marriage rumors broke headlines, he affirmed that he just given a nod to his mom to search for the perfect bride for him and nothing is fixed. Looks like, his family has taken not much time to find the perfect match for the leggy lad.
Please Wait while comments are loading...