బాలయ్య మనవడు ఎవరి పోలిక? (క్లోజప్ ఫోటో)
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అందుకు కారణం బాలయ్య తాత కావడమే. ఆయన కూతురు బ్రాహ్మణి - అల్లుడు లోకేష్ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య మనవడికి సంబంధించిన క్లోజ్ ఫోటో ఒకటి బయటకు రిలీజైంది.
ఇటీవలే నారా లోకేష్ తన కొడుకుని ఎత్తుకున్న ఫోటో ఒకటి విడుదలైనా...అందులో బాబు పోలికలు సరిగా ఏర్పడలేదు. తాజాగా ఏర్పడిన క్లోజ్ ఫోటోలో బాబు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్నారికి ఎవరి పోలికలు వచ్చాయి? నందమూరి వంశంవారి పోలికలు వచ్చాయా? నారా వంశం వారి పోలికలు వచ్చాయా? అనే చర్చల్లో మునిగి పోయారు ఫ్యాన్స్.

ఇటు బాలయ్య కుటుంబంలో....అటు చంద్రబాబు కుటుంబంలో జన్మించిన తొలి సంతానం కావడంతో రెండు కుటుంబాల వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ఫోటోపై మీరూ ఓ లక్కేయండి, బాబు ఎవరి పోలికతో ఉన్నాడో మీ అభిప్రాయాలు వెల్లడించండి.


Click it and Unblock the Notifications











