twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత ఆత్మ హత్యా ప్రయత్నం?

    By Staff
    |

    Dongala Bandi
    దొంగలబండి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడుతోంది. మొన్న సాయింత్రం ఈ సంఘటన చోటు చేసుకుందని ...వెంటనే ఆయన్ని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసారని చెప్తున్నారు.అలాగే ఈ విషయాన్ని బయిటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్తున్నారు. అయితే ఎందుకిలా జరిగిందన్న దానికి కారణాలు తెలియరావటం లేదు. కొందరు దొంగలబండి ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటమే కారణమంటున్నారు.

    దాదాపు నాలుగు కోట్లకు పైగా ఖర్చు అయిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అంతా ఊహించారు. అయితే ఊహించని విధంగా భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. బ్లేడు బాబ్జి విజయం ఎఫెక్టు కూడా ఈ చిత్రంపై పనిచేయలేదు.ఇక అల్లరి నరేష్,తాన్యా జంటగా నటించిన ఈ చిత్రంతో కామెడి చిత్రాల మాటల రచయిత వేగెష్న సతీష్ దర్శకుడుగా పరిచయం అయ్యారు.జి.యస్.కె నెట్ వర్క్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫ్లాప్ టాక్ రాగానే ఈ సినిమా ఫబ్లిసిటీని సైతం తగ్గించేసారు. అయితే అయితే అది నిజం కాదని మరి కొందరు అంటున్నారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.మామూలు అనారోగ్య కారణాలతోనే ఆయన ఆసుపత్రికు వెళ్ళారని అంటున్నారు. ఈ వార్త నిజం కాకూడదనే మనం ఆసిద్దాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X