22 కోట్ల అప్పు: రజనీకాంత్ ఆస్తులు వేలం
చెన్నై: రజనీకాంత్ అభిమానులకు షాకింగ్ న్యూస్. అప్పు చెల్లించని కారణంగా ఆయన ఆస్తులను బ్యాంకు వారు వేలం వేస్తున్నారు. సౌతిండియాలో అత్యధికంగా రెమ్యూనరేన్ తీసుకునే హీరో అయిన రజనీకాంత్ విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళితే...
ఎగ్జిమ్ బ్యాంకుకు బాకీ ఉన్న రూ. 22 కోట్లు చెల్లించని కారణంగా ఆయన ఆస్తులు వేలం వేయనున్నట్లు సదరు బ్యాంకు వారు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వార్తా పత్రికల్లో ప్రకటనలు కూడా జారీ చేసారు. మరి రజనీకాంత్ ఇంత మొత్తం ఎందుకు అప్పుగా తీసుకున్నారు, ఎందుకు చెల్లించలేదు అనే విషయాలు ఆరా తీస్తే కొచ్చాడయాన్ సినిమాకు సంబంధించిన ఇంత భారీ మొత్తం బ్యాంకు నుండి అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

మీడియా వన్ అనే సంస్థ ఎగ్జిమ్ బ్యాంకు నుండి రూ. 22 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పు వ్యవహారంలో రజనీకాంత్ భార్య లత షూరిటీ ఇచ్చారు. ఇందుకుగాను రజనీకాంత్‌కు చెందిన కొంత స్థలాన్ని షూరిటీగా చూపారు. అయితే గడుపు దాటినా మీడియా వన్ సంస్థ అప్పు చెల్లించక పోవడంతో రజనీకాంత్ చెందిన ఆస్తిని వేలానికి సదరు బ్యాంకు నోటీసులు జారీ చేసింది.
ఎగ్జిమ్ బ్యాంక్ పత్రిక ప్రకటన నేపథ్యంలో.....రుణం చెల్లించే పనిలో ఉన్నామని మీడియా వన్ సంస్థ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











