twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉన్న పార్టీలకు చిరు ప్రాబ్లమ్!?!

    By Staff
    |

    రాజకీయ పార్టీలకు కొత్త ప్రాబ్లమ్ ఎదురవనున్నది. ఆ ప్రాబ్లమ్ చిరంజీవి నుంచి కావడం విశేషం. చిరంజీవి పార్టీ పెడితే ఇప్పడున్న పార్టీలకే ఆ ప్రాబ్లమ్ ఎదురుకానున్నది. చిరంజీవి పార్టీ పెడితే తమ తమ పార్టీలలో ఉన్న నాయకులు ఎక్కడ అందులో దూకుతారోనని ఆయా పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. తెలుగుదేశానికే ఈ సమస్య ఎక్కువని కాంగ్రెస్ వారు అంటుంటే కాంగ్రెస్ కే ఈ సమస్య ఎక్కువ అని ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలా అనుకొని ఆయా పార్టీలు ఆత్మసంతృప్తి చెందుతున్నాయి. కొత్త పార్టీ రంగంలోకి వచ్చినపుడు కప్పదాటు వ్యవహారాలు కొత్తేం కాకపోయినప్పటికీ ఇపుడు వస్తున్నది చిరంజీవి కావడం, ఆయనను రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశాలకు ప్రత్యమ్నాయంగా చెప్పుకోవడమే సీరియస్ గా కనిపించే అంశం. రెండు పార్టీలే ఉంటే బొమ్మో బొరుసో అన్నట్టుగా ఈ పార్టీ వదిలితే ఆ పార్టీ, ఆ పార్టీ వదిలితే ఈ పార్టీలోకి చేరుతారులే అన్నట్టుగా ఉండేది. కానీ మూడో ప్రత్యామ్నాయం వస్తే ఇద్దరు గొడవపడుతుంటే మూడో వ్యక్తికి అవకాశం లభించినట్టుగా ప్రజలు ఆలోచిస్తే ఉన్న పార్టీలకు తిప్పలు తప్పవు. చిరంజీవిదే ఆలస్యం కదా.

    Read more about: chiranjeevi pavan kalyan cpi bsp
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X