గోవిందుడు ఎవ్వరివాడుతో బృందావనం పై అంచనాలు పెరిగాయి..!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఖలేజా తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా బృందావనం. పోయిన గురువారం విడుదలైన ఈసినిమా నిన్నటివరకు మంచి హౌస్ పుల్ కలేక్షన్లు రాబట్టింది. ఐతే ఇప్పటివరకు దసరాసెలవులు మరియు వారాంతపు సెలవులు రావడంతో మంచి వసూళ్శను రాబట్టిన ఈ సినిమా సోమవారం ఎలా ఉంటుందోనని సినీవిశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మన తెలుగు మేధావులుకి నచ్చిన సినిమాలు కోన్ని మాస్ ఆడియన్స్ కు నచ్చవు. అలాంటికోవలోకి చెందుతాయి ప్రస్దానం, వేదం లాంటి సినిమాలు. ఐతే ఎన్టీఆర్ నటించినటువంటి బృందావనం సినిమాకి మొదటినుండి పాజిటివ్ గా రివ్యూస్ రాయడం వల్ల ఈ సినిమాని సినీవిశ్లేషకులు ఎక్కడికో తీసుకోనిపోయారు.
సినిమాలను ప్రచారం చేయడంలో దిల్ రాజుకి మంచి అనుభవం ఉంది కాబట్టి మొదటినుంచి ఈ సినిమాని ప్రేక్షకులకు చేరువచెయ్యడంలో తాను సఫలీకృతం అయ్యడానే చెప్పాలి. బృందావనం సినిమా గురించి ఇప్పటికే అన్ని టివిలలో ఇచ్చినటువంటి ప్రాగ్రాంలకు మంచి స్పందన వచ్చినసంగతి అందరికి తెలిసిందే. దసరా సందర్బంగా ఈ సినిమాపై మాటివి మరియు జెమినిటివిలలో 'గోవిందుడు ఎవ్వరివాడు' అనే కార్యక్రమం చాలా క్లిక్ అవ్వడంతో ఈసినిమాపై అంచనాలు పెరిగాయి.


Click it and Unblock the Notifications











