నాగ్ ‘శివ’పై డాక్యుమెంటరీ ఇదే(వీడియో)

By Srikanya

హైదరాబాద్: ‘శివ'కు ముందు తెలుగు సినిమా...‘శివ'తర్వాత తెలుగు సినిమా అనేంతలా చరిత్రలో నిలిచిపోయిన చిత్రం ‘శివ'. ఈ చిత్రం అక్టోబర్ 5 కు పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పై డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీలో ‘శివ' చిత్రం గురించి ప్రముఖ దర్శకులు అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. వీటిని మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

పాతికేళ్ల క్రితం రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన మొదటి చిత్రం ‘శివ' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో, కాలేజీ విద్యార్థులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో తెలిసిందే. ఆ చిత్రంతో రాత్రికి రాత్రే వర్మ అగ్ర దర్శకుడిగా మారిపోయారు. అలాగే టైటిల్‌ రోల్‌ చేసిన నాగార్జున కెరీర్‌లో ఈ సినిమా మైలురాయిలా నిలిచింది. అక్టోబర్‌ 5తో ఆ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తి అయ్యాయి.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సినిమాపై ఈ ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించారు వర్మ. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఆయన యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘శివ' వెనుక ఉన్న విశేషాలనూ, దానికి సంబంధించిన టెక్నికల్‌ అంశాలనూ, అందులో నటించిన ప్రధాన పాత్రధారుల ఇంటర్వ్యూలనూ ఈ డాక్యుమెంటరీలో ఆయన పొందుపరిచారు.

Exploring Shiva Movie After 25 Years

అలాగే ‘శివ' చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు తెలియచేసారు. ఇప్పుడున్న టెక్నాలిజీకి అణుగుణంగా డిజిటల్ లోకి మార్చి రీ మాస్టర్ ప్రింట్ తో విడుదల చేస్తారు.

నాగార్జున మాట్లాడుతూ... ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను నవంబర్ నెలలో తిరిగి విడుదల చేస్తున్నాం. డిజిటల్ రీమాస్టర్ ప్రింట్ తో సుమారు 100 థియేటర్లలో ‘శివ' సినిమాను ప్రదర్శిస్తాం అని అన్నారు.

అలాగే... నా జీవితంలో ఎన్నో తప్పులు చేసాను. ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఒక్క శివ తీసాను. అందుకు గర్విస్తాను. నా సినీ జీవితాన్నే కాక, వ్యక్తిగతం జీవితాన్ని కూడా మార్చేసిన సినిమా అది అన్నారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... శివ సినిమాతో అందరూ నేను రూల్స్ బ్రేక్ చేసానని అంటూంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే అప్పటికి నాకు అస్సలు రూల్స్ అనేవే తెలియదు. అందుకే ఆ చిత్రం ట్రెడ్ సృష్టించింది. ఇప్పటికీ, ఎప్పటికీ నేను చెప్పేది ఒకటే శివ కేవలం నాగార్జున వల్లే సాధ్యమైంది అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X