మహేష్‌ను డామినేట్ చేసేందుకే కాజల్ అలా...!
టాలీవుడ్ అందగాడు ఎవరంటే...చాలా మంది నోటి నుంచి వినిపించేది సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు. ఎంత అందమైన హీరోయిన్ అయినా, పిచ్చెక్కించే షేపులు ఉన్నా...మహేష్ బాబు గ్లామర్ ముందు వారంతా దిగదుడుపే అవుతుంటారు. రాజకుమారుడు సినిమాలో ప్రీతి జింతా దగ్గర నుంచి నిన్నటి దూకుడు సినిమాలో సమంత వరకు పరిస్థితి గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. వేరే హీరోల సినిమాల్లో హీరోయిన్ల నటనకు, అందానికి హీరోలకంటే ఎక్కువ మార్కులు పడొచ్చునేమోగానీ, మహేష్ బాబు సినిమాలో వాళ్ల పప్పులేవీ ఉడకవనేవి అందరిరీ తెలిసిన విషయమే.
తాజాగా బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తున్న కాజల్ ఎట్టాగైనా ఈ పోకడను తారుమారు చేయాలని కంకనం కట్టుంది. సినిమాలో మహేష్ బాబును డామినేట్ చేయాలనే స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన ఈ భామ.....ఎక్స్ ఫోజింగ్ డోసు పెంచినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన బిజినెస్ మ్యాన్ ట్రైలర్లు, వాల్ పోస్టర్లు గమనిస్తే స్పష్టం అవుతోంది. కాజల్ తపనకు పూరి సపోర్టు కూడా తోడవటంతో రెచ్చిపోయి అందాలను హాట్ గా ఆరబోరడంతో పాటు, చూసే వారికి మాంచి మూడ్ వచ్చేలా మహేష్ బాబుతో రొమాన్స్ కూడా చేసింది. మరి ఆవిడ ప్రయత్నం ఏమేరకు ఫిలిస్తుందనేది సినిమా విడుదలైతేగానీ తెలీదు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'బిజినెస్ మేన్' సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











