బండ్ల గణేష్‌పై కేసు అందుకే పెట్టా.. అలా విసిగిపోయి.. టాప్ డైరెక్టర్ క్లారిటీ
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాను మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తాను అభిమానించే నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అయితే మంచి జోష్ మీద ఉన్న బండ్లన్నకు రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ బ్రేక్ వేశాడు. ఆయనపై వేసిన కేసు వివరాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ..
బండ్ల గణేష్‌తో వివాదానికి కారణం టెంపర్. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన ఆ సినిమాకు నేను కథ రాశాను. ఆ సమయంలో నాకు ఓ అమౌంట్ రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పాడు. అయితే సినిమా రిలీజ్ తర్వాత హిట్ అయింది. అయితే తనకు రావాల్సిన రెమ్యునరేషన్ గురించి మాట్లాడితే స్పందించలేదు అని వక్కంతం వంశీ తెలిపాడు.

అయితే సినిమా రిలీజ్ తర్వాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు చేసినా లాభం ఉండదు. రిలీజ్‌కు ఫిర్యాదు చేస్తే ప్రయోజనం ఉంటుంది. అయితే పలుమార్లు నేను ఆయనతో రెమ్యునరేషన్ గురించి చర్చించాను. కానీ ఫలితం లేకపోయింది. విసిగిపోయి చేసేది ఏమీ లేక అందుచేతనే కోర్గు మెట్లు ఎక్కాల్సి వచ్చింది అని వక్కంత వంశీ అన్నాడు.
అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత చాలా రోజులు వేచి చూశాను. చాలా నెలలు కోర్టు చుట్టూ తిరిగాను. బండ్ల గణేష్ కంటే నేను ఎక్కువగా కోర్టుల చుట్టు తిరిగాను. చెక్ బౌన్స్ కేసులో కోర్టు తీర్పు వచ్చే సరికి నాతో ఆయన సెటిల్ చేసుకొన్నాడు. నాకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాడు. దాంతో ఆ వివాదం ముగిసిపోయింది అని వక్కంత వంశీ చెప్పారు.

అయితే డబ్బుల వివాదం పక్కన పెడితే.. నేను, బండ్ల గణేష్ ఇద్దరం మంచి స్నేహితులం. మేమిద్దరం రెగ్యులర్‌గా కలుస్తుంటాం. ఆ సినిమా విషయంలో మా మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత మళ్లీ మా మధ్య అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకొన్నాం అని వక్కంతం వంశీ చెప్పారు.
వక్కంత వంశీ విషయానికి వస్తే.. నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా ఆయన ఎక్ట్రా ఆర్డినరీ మెన్ సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు కలెక్షన్లను సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











