»   »  ఎక్సట్రార్డనరీ : 'బాహుబలి' భారీ సెట్స్ డిజైన్స్ ఇవిగో (ఫొటోలు)

ఎక్సట్రార్డనరీ : 'బాహుబలి' భారీ సెట్స్ డిజైన్స్ ఇవిగో (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ఇది కేవలం ప్రాంతీయ సినిమా కాదు... జాతీయ స్థాయి సినిమా. ఆ రకంగానే భారీయెత్తున ప్రమోట్ చేయా'లన్నారు'' అని 'బాహుబలి' వర్గాలు చెప్తున్నాయి. తెలుగు నుంచి హిందీలోకి, తమిళ వెర్షన్ నుంచి మలయాళంలోకీ ఫస్ట్‌పార్ట్ డబ్బింగ్ చేస్తున్నారు. ఆ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. జూలై 10న ఈ నాలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన సెట్స్ ఫొటోలు బయిటకు వచ్చాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ ఫొటోలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా... ప్రచార చిత్రాల్ని చూసి అందులోని సాంకేతికత గురించి హాలీవుడ్‌ సైతం చర్చించుకొంటోంది . తెలుగు,తమిళ, హిందీ,మళయాళ భాషల్లో విడుదల చేయటానికి రెడీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రేక్షకుల కోసం ఈ చిత్రంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వం వహించారు.శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. కీరవాణి సంగీతం అందించారు.


'బాహుబలి' సెట్స్ ఫొటోలు... స్లైడ్ షోలో...


ఇంతకీ 'బాహుబలి' కథేంటి?

ఇంతకీ 'బాహుబలి' కథేంటి?


చిత్రం కథపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఖండనలూ వస్తున్నాయి. ఇది జైనులు ఆరాధించే 'బాహుబలి' కథ అని కొందరంటున్నారు. యుద్ధం నుంచి శాంతికి పరివర్తన చెందిన మహావీరుడి జీవితం నుంచి తీసుకున్నారని మరికొందరు. అయితే, అవేవీ నిజం కాదని ఆంతరంగిక వర్గాల మాట. రాజుల కాలపు ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా - పూర్తిగా కల్పిత కథ.పగ..పోరాటం..

పగ..పోరాటం..


రాజ్యాధికారం కోసం సాగే పోరాటం. పగ, ప్రతీకారం, ప్రేమ, అసూయల మధ్య సినిమా నడుస్తుంది. శివుడుగా, బాహుబలిగా ఇందులో రెండు పాత్రల్ని ప్రభాస్ పోషిస్తున్నారు.ప్రభాస్ మాటల్లో...

ప్రభాస్ మాటల్లో...


''ఇది - రాజులు, రాజ్యాలు, అధికారం కోసం సాగే పోరాటం, యోధానుయోధుల చుట్టూ తిరిగే కాల్పనిక గాథ''.అందుకే బాహుబలి

అందుకే బాహుబలి


బాహువుల్లో అపారమైన బలం ఉన్న వ్యక్తి గనక, అతణ్ణి 'బాహుబలి' అంటారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.


మరి రాజమౌళి మాటల్లో

మరి రాజమౌళి మాటల్లో


... బాహుబలి అంటే ''ది ట్రూ కింగ్'' అని అర్దం. అందుకు తగినట్లే సీన్స్ ఉన్నాయని చెప్తున్నారు.అనుష్క కనిపించేది కాసేపేనా?

అనుష్క కనిపించేది కాసేపేనా?

ప్రభాస్ వేస్తున్న రెండు పాత్రల్లో ఒక పాత్రే ఫస్ట్‌పార్ట్ 'బాహుబలి... ది బిగినింగ్'లో కనిపిస్తుందని ఒక రూమర్ షికారు చేస్తోంది. అదేమిటని ఆరా తీస్తే, రెండు పాత్రలూ ఇందులో కనిపిస్తాయని తెలిసింది.రానా పాత్ర ఇదే..

రానా పాత్ర ఇదే..


బాహుబలిలో హీరో తరువాత హీరో అంతటి ప్రాధాన్యమున్న పాత్ర - భల్లాలదేవ. బాహుబలికి తమ్ముడి వరసయ్యే పరమ దుష్టుడు. ఆ పాత్రను వేస్తున్నది రానా దగ్గుబాటి. సినిమా మొత్తం ఈ క్యారెక్టర్ మీద నడుస్తుంది. అది అంత పవర్‌ఫుల్ పాత్ర.రానా పాత్ర గురించి ప్రభాస్

రానా పాత్ర గురించి ప్రభాస్


''రానా చేసిన భల్లాలదేవ క్యారెక్టర్ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమ విలన్ పాత్రల్లో ఒకటవుతుంది. ఆ మాట నమ్మకంగా చెప్పగలను''అని ప్రభాస్ చెప్తున్నారు.తమన్నా పాత్ర ఏంటి

తమన్నా పాత్ర ఏంటి


బాహుబలి ప్రేమికురాలు అవంతిక పాత్రధారిణి-తమన్నా. ఈ ఫస్ట్‌పార్ట్‌లో ఆమే ప్రధాన హీరోయిన్.అనుష్క పాత్ర ఫస్టాఫ్ లో కొంతే

అనుష్క పాత్ర ఫస్టాఫ్ లో కొంతే

ఇక, అనుష్క పోషించే కీలక పాత్ర దేవసేన. అయితే, ఈ ఫస్ట్ పార్ట్‌లో ఆమె కనిపించేది మాత్రం చాలా కొద్దిసేపేనట! అదీ ఈ మధ్య విడుదల చేసిన వయసు మీద పడ్డ గెటప్‌లోనే అట!సెకండాఫ్ మొత్తం అనుష్కదే

సెకండాఫ్ మొత్తం అనుష్కదే


2016లో వచ్చే 'బాహుబలి' సెకండ్ పార్ట్ (దానికి ఇంకా పేరేదీ ఖరారు చేయలేదు)లో మాత్రం అనుష్క పాత్రదే హవా అని తెలుస్తోంది.హేమా హేమీలు

హేమా హేమీలు


అలాగే, రమ్యకృష్ణ, తమిళం నుంచి నాజర్, సత్యరాజ్, కన్నడం నుంచి 'ఈగ' ఫేమ్ సుదీప్ లాంటి భారీ తారలు ఈ సినిమాలో ఉండనే ఉన్నారు.బహు కష్టం

బహు కష్టం


ప్రీ-ప్రొడక్షన్‌కే... ఆరు నెలల పైగా... 'బాహుబలి' సెట్స్, పాత్రల రూపురేఖలు, దుస్తులు,అలంకరణ లాంటి వాటికి పాతిక మందికి పైగా ఆర్టిస్టులు దాదాపు 15 వేలకు పైగా రేఖాచిత్రాలు గీశారు.ఆయన ప్రతిభే

ఆయన ప్రతిభే


జాతీయ స్థాయిలో పేరున్న ఆర్ట్ డెరైక్టర్ సాబూ శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. బ్రహ్మాండమైన సెట్స్ వేశారు.అంతేనా...

అంతేనా...


అంతటితో ఆగకుండా, సాబూ శిరిల్ అక్షరాలా ఒక మెకానికల్ ఇంజనీర్ లాగా అగ్ని గోళాలను విసిరే యంత్రాలు, నీటిని పైకి తోడే పరికరాల లాంటి వాటిని సొంతంగా తయారు చేశారు. ఇప్పటికీ ఆ పరికరాలను స్వయంగా ఉపయోగించి చూడవచ్చు.కాస్ట్యూమ్స్ అదిరాయి

కాస్ట్యూమ్స్ అదిరాయి


రాజమౌళి సతీమణి రమా రాజమౌళి, ప్రశాంతి తిపిర్నేని కాస్ట్యూమ్స్ పని మామూలుగా లేదు.ఎప్పటిలాగే..

ఎప్పటిలాగే..


రాజమౌళి ఆస్థాన కెమేరామన్ కె.కె. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. కాన్సెప్ట్ స్కెచ్‌ల మొదలు... ఎక్కడ, ఏ సీన్ ఎలా తీయాలి, ఏం చేయాలి, ఏ డ్రెస్‌లు, ప్రాపర్టీ వాడాలనేది పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొన్నాకే షూటింగ్‌కు వెళ్ళారు.ఆదా అయ్యింది

ఆదా అయ్యింది


ఇలా ఆరు నెలలకు పైగా ప్రీ పొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకోవడం వల్ల చిత్ర నిర్మాణవ్యయంలో దాదాపు 25 నుంచి 30 శాతం ఆదా అయింది
నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆ సంగతి వెల్లడించారు..ఎక్కడ ప్రారంభమైంది?

ఎక్కడ ప్రారంభమైంది?


రెండేళ్ళ క్రితం 2013 జూలైలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర 'బాహుబలి' షూటింగ్ మొదలైంది.ఎక్కువ భాగం

ఎక్కువ భాగం


సినిమా ప్రధానంగా ఆర్.ఎఫ్.సి.లో తీశారు. రామోజీ ఫీల్మ్ సిటీలో సెట్స్ వేసి ...సీక్రెట్ గా లాగించేసారుసెన్సార్ పూర్తైంది

సెన్సార్ పూర్తైంది


దాదాపు రూ: 200కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందిన 'బాహుబలి' గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం సెన్సార్ పనులను పూర్తిచేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని అందుకుంది.ఇంకెక్కడ తీశారు?

ఇంకెక్కడ తీశారు?


కొంత భాగం మహాబలేశ్వర్‌లో, రెండు పాటలు అన్నపూర్ణా ఏడెకరాల్లో వేసిన సెట్స్‌లో చిత్రీకరించారు.అంతేనా...

అంతేనా...


కథానుసారం మంచు కొండల నేపథ్యం అవసరం. దాంతో, బల్గేరియా వెళ్ళి, అక్కడ నెల రోజుల పాటు షూట్ చేశారు. కీలక దృశ్యాలు తీశారు.టైటిల్ మొదట వేరే..తర్వాత మార్చారు

టైటిల్ మొదట వేరే..తర్వాత మార్చారు


తమిళంలో 'బాహుబలి'కి మొదట అనుకున్న పేరు - 'మహాబలి'. కానీ, తమిళ సంప్రదాయంలో ఆ పేరు ఒక రాక్షసుడిదట! దాంతో, వెనకడుగు వేశారట! పైగా 'బాహుబలి' అనే పేరే అన్ని భాషల్లో ఉంటే బ్రాండ్‌గా డెవలప్ చేయడం ఈజీ. అది గ్రహించి, చివరకు ఆ పేరే అన్ని భాషల్లో ఉంచారు.3డి ఆలోచన ఎందుకు వద్దనుకున్నారు ?

3డి ఆలోచన ఎందుకు వద్దనుకున్నారు ?


అసలు ముందుగా ఈ చిత్రాన్ని 3డి వెర్షన్‌లో, ఐ-మ్యాక్స్ వెర్షన్‌లో కూడా చేయాలని అనుకున్నారట. కానీ, ఇంతకు ఇంత ఖర్చవుతుంది, టైమ్ పట్టేస్తుందని గుర్తించి, ఆలోచన దశలోనే ఆ ప్రతిపాదనను చిత్ర యూనిట్ విరమించుకుందని తెలిసింది.విభిన్నమైన ప్రమోషన్

విభిన్నమైన ప్రమోషన్


ఫ్రీగా కోట్ల పబ్లిసిటీ దాదాపు రెండేళ్ళుగా నిర్మాణంలో ఉన్నప్పటికీ 'బాహుబలి' ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్‌తో జనం నోట నానుతూనే ఉంది. ఇన్నేళ్ళుగా పబ్లిక్‌లో ఇంట్రెస్ట్ తగ్గకుండా ఉండేలా చేయడానికి విభిన్నమైన పబ్లిసిటీ, ప్రమోషన్‌లు అనుసరించారు.స్పెషల్ గా...

స్పెషల్ గా...ఫస్ట్‌లుక్స్, మేకింగ్ వీడియోలు మధ్య మధ్య రిలీజ్ చేశారు. ఇప్పటి దాకా ఏ మీడియాలోనూ ఒక్క రూపాయి కూడా యాడ్స్‌కు ఖర్చు పెట్టలేదు. ఆధునిక సాంకేతికతను నేర్పుగా వాడుకున్నారు.సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారానే

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారానే


కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్‌వర్క్ మీదే ఆధారపడ్డారు. కొన్ని పదుల కోట్ల రూపాయల పబ్లిసిటీని తెలివిగా పొందారు.అనేక జాగ్రత్తలు

అనేక జాగ్రత్తలు


సినిమా రిలీజ్ డేట్లు చాలాసార్లు మారుతూ వచ్చినా, ఆ ఎఫెక్ట్ పడకుండా దర్శక, నిర్మాతలు జాగ్రత్త పడ్డారు.హైప్ క్రియేట్

హైప్ క్రియేట్


సినిమాలోని ప్రధాన పాత్రల గెటప్ పోస్టర్లు, ఆ పాత్రల స్వభావం గురించి దర్శకుడి కామెంట్స్‌తో యూనిట్ హైప్ క్రియేట్ చేసింది.ఫేస్ బుక్ లో ...

ఫేస్ బుక్ లో ...


ఇప్పటికే ఈ సినిమా అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌ను 10 లక్షల 33 వేల మందికి పైగా లైక్ చేసి, ఫాలో అవుతున్నారు.ఇదీ రికార్డే...

ఇదీ రికార్డే...


''భారత్‌లోనే అతి పెద్దదీ, అతి వేగంగా అభిమానులు విస్తరిస్తున్నదీ - ఈ ఫేస్‌బుక్ పేజీనే! అలాగే, దక్షిణాదిలో ఏ సినిమాకూ కనీవినీ ఎరుగని సంఖ్యలో ట్విట్టర్ ఫాలోయర్లున్నదీ 'బాహుబలి'కే''ట్వీట్స్ తో ...

ట్వీట్స్ తో ...


ట్విట్టర్‌లో 80,400 మందికి పైగా ఫాలోయర్లున్నారు. అక్కడ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నారు.వాట్సప్ లోనూ

వాట్సప్ లోనూ


మరింతగా జనాల్లోకి దూసుకు వెళ్లటానికి వాట్సప్ లోనూ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు.కాపీ అన్నారు.

కాపీ అన్నారు.


గాజులు వేసుకున్న ఒక చెయ్యి నీటి ప్రవాహంలో నుంచి పైకి లేచి, పసిబిడ్డను మునిగిపోకుండా పెకైత్తి పట్టుకున్న దృశ్యాన్ని 'బాహుబలి' పోస్టర్ల సిరీస్‌లో ముందుగా రాజమౌళి విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆలోచన, ఒక ఇంగ్లీషు సినిమా పోస్టర్‌కు ఇమిటేషన్ అంటూ సోషల్ మీడియాలో చర్చ చెలరేగింది. తర్వాత వచ్చినవాటికి కూడా..

తర్వాత వచ్చినవాటికి కూడా..


అలాగే, ఆ తరువాత వచ్చిన మరికొన్ని పోస్టర్లకూ, పాత సినిమాల్లోని పాత్రలకూ పోలికలున్నాయంటూ కాపీ ఆరోపణలు వచ్చాయి . చిత్ర యూనిట్ మాత్రం దేనికీ పెదవి విప్పలేదు.లీక్...తలనొప్పి

లీక్...తలనొప్పి

'బాహుబలి' రిలీజ్ కాకుండానే, ఫస్ట్‌పార్ట్‌లో 12 నిమిషాల ఫుటేజ్ కొన్ని నెలల క్రితం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. గ్రాఫిక్స్ వర్క్ కోసం పంపిన ముడిసరుకు దృశ్యాలవి. వాటిని కొందరు 'ఇంటి దొంగలే' అక్కసుతో బయటపెట్టారు.చాలా కష్టం

చాలా కష్టం


ఆ వ్యవహారంపై దర్శక, నిర్మాతలు సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని, నెట్‌లో ఎక్కడా ఆ ఫుటేజ్ లేకుండా చేశారు.రెండు షిప్ట్ లలో..

రెండు షిప్ట్ లలో..


ఏప్రిల్ నెలాఖరుకు కూడా హైదరాబాద్‌లోని మకుట, ఫైర్‌ఫ్లై, చెన్నైలోని ప్రసాద్ ఇ.ఎఫ్.ఎక్స్‌తో సహా వివిధ దేశాల్లో 17 వి.ఎఫ్. ఎక్స్. స్టూడియోల్లో 600 మందికి పైగా సాంకేతిక నిపుణులు ఒకటికి రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.భారీ ఎత్తున

భారీ ఎత్తున


హిందీలో పెద్దయెత్తున మార్కెటింగ్‌కు ఇంకొంత టైమ్ తీసుకుని చేస్తున్నారు. హిందీ వెర్షన్‌ను సమర్పి స్తున్న దర్శకుడు కరణ్ జోహార్ సూచన మేరకు, హిందీకి కూడా కలిసొచ్చేలా జూలై 10కి రిలీజ్ ఫిక్స్ చేశారు.ఆయనే కో ఆర్డినేటర్

ఆయనే కో ఆర్డినేటర్


హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో మూడుసార్లు ('మ్యాజిక్... మ్యాజిక్', రజనీకాంత్ - శంకర్‌ల 'శివాజీ...ది బాస్', 'యంతిరన్... ది రోబో') జాతీయ అవార్డు అందుకున్న గ్రాఫిక్స్ నిపుణుడు శ్రీనివాస్ మోహన్. 'బాహుబలి' గ్రాఫిక్స్ పనులన్నిటికీ కో-ఆర్డినేటర్‌గా సారథ్యం వహిస్తున్నది ఆయనే.అంత ఖర్చే...

అంత ఖర్చే...


హై క్వాలిటీ కావాలంటే, ప్రతి 10 సెకన్ల విజువల్ ఎఫెక్ట్‌కూ దాదాపు రూ. 50 వేల దాకా ఖర్చవుతుంది. అలాంటిది 'బాహుబలి'లో ఒక్క గ్రాఫిక్స్‌కే సుమారు రూ. 70 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారని సమాచారం.అన్ని సీన్లకూ తప్పదూ

అన్ని సీన్లకూ తప్పదూ


సినిమాలో దాదాపు 95 శాతం సీన్లలో గ్రాఫిక్స్ ఉంటాయని తెలుస్తోంది.పాటలు అదిరాయి...

పాటలు అదిరాయి...


ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు మంచి హిట్టయ్యాయి.ఆడియో రైట్స్ అంతకు..

ఆడియో రైట్స్ అంతకు..


తెలుగు, తమిళ ఆడియో హక్కుల్ని బెంగుళూరుకు చెందిన లహరి మ్యూజిక్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. వారు కేవలం 15 ఏళ్ళ కాలపరిమితికి రూ. 3 కోట్ల పైచిలుకు చెల్లించి, హక్కులు కొనడం విశేషం. తెలుగులో తొలిసారిగా....

తెలుగులో తొలిసారిగా....


డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్‌తో విడుదలవుతున్న హై క్వాలిటీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ 'బాహుబలి'. అందుకోసం ప్రసిద్ధ ఇంజనీర్ పి.ఎం. సతీష్ ఈ సినిమా సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు చూస్తున్నారు.హిందీ వెర్షన్‌ను.....

హిందీ వెర్షన్‌ను.....


ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సారథ్యంలోని ధర్మ ప్రొడక్షన్స్, అనిత్ తడానీకి చెందిన ఎ.ఎ. ఫిల్మ్స్ సమర్పిస్తున్నాయి.తమిళంలోనేమో.....

తమిళంలోనేమో.....


యు.వి. క్రియేషన్స్, హీరో సూర్య సన్నిహితులదైన స్టూడియో గ్రీన్ సంస్థ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.హీరో సూర్య ఏమన్నారంటే....

హీరో సూర్య ఏమన్నారంటే....


''ఎప్పుడెప్పుడా అని 'బాహుబలి' కోసం తమిళనాడు మొత్తం వేయికళ్ళతో నిరీక్షిస్తోంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.ఇతర దేశాల్లో

ఇతర దేశాల్లో


భారతీయ భాషలతో పాటు చైనీస్‌లోనూ, యూరోపియన్ భాషల్లోనూ 'బాహుబలి'ని ఇంగ్లీషు సబ్‌టైటిల్స్‌తో విడుదల చేయాలనుకుంటున్నారు. ఏషియన్ సినిమా మార్కెట్‌లైన జపాన్, సౌత్ కొరియాలకు కూడా ఈ సినిమా వెళ్ళనుంది. ఇప్పటికే, చైనాలో అధికారిక 'చైనీస్ ఫిల్మ్ కార్పొరేషన్'తో ఒప్పందం కూడా చేసుకున్నారు. వచ్చే ఏడాది మొదట్లోనే చైనీయుల్ని అక్కడి భాషలో పలకరిస్తుంది
నా భార్య రమ నా వెనుక లేకపోతే.. ఈ సినిమా తీయగలిగేవాడ్ని కాదు. పేరుకు వదిన కానీ... వల్లిగారు మా అమ్మ. ఆమె ఈ సినిమాకి ఓ పిల్లర్‌. అన్నయ్య కీరవాణి లాంటి సంగీత దర్శకుడు ఇంకెవ్వరికీ దొరకరు. నా సినిమాల్లోని డ్రమటిక్‌ సన్నివేశాలు మీ అందరికీ నచ్చుతున్నాయంటే కారణం.. మా నాన్నగారి నుంచి నేను నేర్చుకొన్న విద్యే. మా అబ్బాయి కార్తికేయ అన్నీ తానై చూసుకొన్నాడు'' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.


Pic Credits :http://baahubali.deviantart.com/

English summary
Have you checked out our artwork on Deviant Art yet? From illustrations of the landscape to the interior of the royal court – Get a sneak peek into the world of Baahubali even before the film’s release! Only at baahubali.deviantart.com
Please Wait while comments are loading...