»   » "ఫక్ రానా..." అంటూ స్టార్ డైరక్టర్ ట్వీట్

"ఫక్ రానా..." అంటూ స్టార్ డైరక్టర్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తూంటే ఒకే ఒక్క పదం వాడితే న్యాయం అనిపిస్తోంది. అది ఫక్...రానా..నువ్వు సూపర్ ", ఇలాంటి ట్వీట్ చేసేది ఎవరై ఉంటారు. మీ ఊహ కరక్టే. ఆ ట్వీట్ చేసింది మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ. ఆయన రీసెంట్ గా...బాహుబలి లో రానా ఫస్ట్ లుక్ ని చూసి ఇలా స్పందించారు. ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రానా హీరోగా డిపార్టమెంట్ అనే డిజాస్టర్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

భల్లాలదేవ పాత్రలో నటించిన రానా ప్రచార చిత్రాన్ని బుధవారం రాజమౌళి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. సినిమాలో రానా ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. క్రూరుడైన ఓ రాజుగా ఆయన తెరపై సందడి చేయబోతున్నారు.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌ హీరో. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా ముఖ్యభూమిక పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలోని తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో జులై 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

F*ck Rana. You're Superstar : RGV

మరో ప్రక్క పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్‌ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. తెలుగు నాట ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ హక్కులు కూడా అమ్ముడయిపోయాయి.

ప్రభాస్‌తో ‘మిర్చి', శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌' చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ తమిళనాడుకు చెందిన స్డూడియో గ్రీన్‌ సంస్థతో కలిసి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ తమిళ వెర్షన్‌ హక్కులు సుమారు రూ.25 కోట్లు పలికినట్లు కోలీవుడ్‌ సమాచారం.

English summary
"The only word that can do justice to the first look poster is FFFFFFFUUUUUCCCKKKK! RRRAANNA U ARR SSSSUPPERRR!", said RGV.
Please Wait while comments are loading...