ఎఫ్ 2 పార్టీలో మునిగి తేలిన వెంకీ, వరుణ్, మెహ్రీన్, అనసూయ (ఫోటోస్)
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీసు విజేత ఎవరు? అంటే మెజారిటీ తెలుగు ప్రేక్షకులు చెబుతున్న మాట 'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్'. 'ఎన్టీఆర్-కథానాయకుడు', 'వినయ విధేయ రామ' సినిమాలతో పోటీ పడుతూ ఎలాంటి అంచనాలు, భారీ హైప్ లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల పంట పండిస్తోంది.
సంక్రాంతి అంటే ఫ్యామిలీతో కలిసి ఆనందంగా గడిపే సమయం. కుటుంబం మొత్తం వెళ్లి హాయిగా నవ్వుకునేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని మలచడం... వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ తమ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించడంతో ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయం అందుకుంది.

సక్సెస్ పార్టీ చేసుకున్న ఎఫ్ 2 టీమ్
ఈ సంక్రాంతి విజేత తామే అని తేలడంతో చిత్ర బృందం పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, మెహ్రీన్, అనసూయ, హరితేజ మరికొందరు చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ ఫోటోలను అనసూయ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

అనసూయ సెల్ఫీ
దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ మెహ్రీన్‌తో కలిసి అనసూయ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కొత్త సంవత్సరం వేళ అందులోనూ సంక్రాంతి విజేతలుగా నిలవడం అంటే అంతకంటే ఆనందం ఏముంటుంది?

హరితేజ, ఇతర నటీనటులు
ఈ పార్టీలో ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించిన హరితేజ, మరొకొందరు నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భారీ లాభాలు...
‘ఎఫ్ 2' చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 34 కోట్లకు అమ్మారు. సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే.... భారీ లాభాలు ఖాయంగా కనిపిస్తోంది. నిర్మాత దిల్ రాజ ఫేసు ఆనందంతో వెలగిపోతుండటమే ఇందుకు నిదర్శనం.

థియేటర్లు పెంచుతున్నారు
‘ఎఫ్ 2' సినిమాకు మంచి డిమాండ్ ఉండటంతో థియేటర్ల సంఖ్యకూడా పెంచుతున్నారు. చాలా చోట్ల ఎన్టీఆర్, వినయ విధేయ రామ సినిమా కంటే వేగంగా ‘ఎఫ్ 2' టిక్కెట్లు అమ్ముడు పోతుండటం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను ఆనందానికి గురి చేస్తోంది.


Click it and Unblock the Notifications











