Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ప్రీ రిలీజ్ రివ్యూ
సంక్రాంతి బరిలో దూకిన మరో తెలుగు చిత్రం ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూపొందించిన చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి. మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం పండుగ కానుకగా జనవరి 12న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రానికి సంబంధించిన హైలెట్స్ మీకోసం..
పక్కా ఫ్యామిలి, కామెడీ ఎంటర్టైనర్
పండుగ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పక్కా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్2. ఈ చిత్రంలో వెంకటేష్ భార్య బాధితుడిగా.. వరుణ్ తేజ్ ప్రేమికురాలి బాధితుడిగా నటించారనేది సమాచారం. తమన్నా గయ్యాలి భార్యగా వెంకటేష్‌ను రఫ్ ఆడించే పాత్రలో కనిపించనున్నారు. మెహ్రీన్ అందమైన ప్రియురాలిగా వరుణ్‌తో జతకట్టింది. ఈ జంటల మధ్య కామెడీ బ్రహ్మండంగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంటున్నది.
ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించేలా
కామెడీ ప్రధానంగా సాగే చిత్రంలో ఆద్యంతం ప్రేక్షకులను పగలబడి నవ్వేలా సన్నివేశాలు ఉంటాయని హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొంటూ వస్తున్నారు. వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అని చెబుతున్నారు.
సానుకూల అంశాలు ఇవే
హీరో, హీరోయిన్ల మధ్య పంచ్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి తదితర అంశాలు ప్రధాన ఆకర్షణగా మారాయి. విజ్వువల్గా గొప్పగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఈ సంక్రాంతి బరిలో విడుదలైన ఎన్టీఆర్: కథానాయకుడు, పేట, వినయ విధేయ రామ చిత్రాలపై మిశ్రమ స్పందన రావడం ఎఫ్2 సినిమాకు సానుకూలంగా మారే అవకాశం ఉంది.
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్
దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంలోని మాస్ పాటలు కిక్కెక్కించేలా ఉన్నాయి. ఇక తెరపైన ఈ పాటలు మరింత ఆకట్టుకునేలా చిత్రీకరించినట్టు తెలుస్తున్నది.
నటీనటులు, సాంకేతికవర్గం
ఎఫ్2 చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, ఝాన్సీ, వెన్నెల కిషోర్, ప్రియదర్శిన పులికొండ, అనసూయ భరద్వాజ్, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై విజయ, నాజర్ తదితరులు నటించారు. సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, ఎడిటింగ్ తమ్మిరాజు.