వెంకటేష్-వరుణ్ తేజ్... ‘ఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్!
Recommended Video

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు వెల్లడయ్యాయి. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా రూపొందిన ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరి కెరీర్లోనూ హయ్యెస్ట్ రేటుకు అమ్ముడవ్వటం విశేషం.

రూ. 34 కోట్లు...వెంకీ, వరుణ్ తేజ్ కెరీర్ రికార్డ్
‘ఎఫ్2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అన్ని ఏరియాలకు కలిపి వరల్డ్ వైడ్ రూ. 34 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు వెంకటేష్ కెరీర్లోకానీ, వరుణ్ తేజ్ కెరీర్లోకానీ ఇంత భారీ మొత్తానికి ఏ సినిమా అమ్మడుపోలేదు. ఇద్దరి కెరీర్లో ఇది రికార్డ్ స్థాయి బిజినెస్.

ఏరియా వైజ్ డీటేల్స్
ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే... నైజాం: రూ. 9 కోట్లు, సీడెడ్ రూ. 5 కోట్లు, ఆంధ్ర: రూ. 14 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 2.25 కోట్లు, ఓవర్సీస్ రూ. 4.25 కోట్లు... వరల్డ్ వైడ్ ఓవరాల్‌గా థియేట్రికల్ రైట్స్ రూ. 34.5 కోట్ల బిజినెస్ జరిగింది.

ఆ రెండు సినిమాలతో పోటీ.. అదే ప్లస్ పాయింట్
బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్-కథానాయకుడు', రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ' సినిమాలతో పోటీ పడుతూ ఎఫ్ 2 విడుదల కాబోతోంది. అయితే ఈ రెండు సినిమాలకు భిన్నమైన పూర్తి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టెనర్ కావడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం.

ఫుల్‌గా ఎంజాయ్ చేసే మూవీ
ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో లేదా స్నేహితులతో క లిసి వెళ్లి కడుపుబ్బా నవ్వుకోవాలంటే తమ సినిమాకు రావాలని, మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయని చిత్ర బృందం ప్రచారం చేస్తోంది. ఇటీవల ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


Click it and Unblock the Notifications











