ఎఫ్ 2 , సంక్రాంతి విన్నర్స్: టపాసులు పేల్చిన వెంకీ-వరుణ్, దిల్ రాజు ఉత్సాహం!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహ్రీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన 'ఎఫ్‌ 2-ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన బాక్సాఫీసు వద్ద అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇదే ఈ సంక్రాంతి విన్నర్ అనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సంబరాల్లో మునిగితేలుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ టపాసుల కాల్చారు. అనంతరం మీడియాతో సమావేశమై విజయానందాన్ని పంచుకన్నారు.

చాలా రోజుల తర్వాత ఇలా...

చాలా రోజుల తర్వాత ఇలా...

వెంకటేష్ మాట్లాడుతు... బ్యూటిఫుల్ ఎంటర్టెన్మెంట్ చిత్రాన్ని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. టీమ్ మొత్తం హ్యాపీగా ఉంది. సిన్సియర్ ఒక మంచి వినోదాత్మక సినిమా ఇవ్వాలనే కోరికతో ఈ సంక్రాంతికి రిలీజ్ చేశాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఎన్నో ఏళ్ల తర్వాత థియేటర్‍‌కు వెళ్లి సినిమా చూశాను. ఆడియన్స్ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు.

ఆంధ్ర, తెలంగాణ అంతటా అదరగొడుతోంది

ఆంధ్ర, తెలంగాణ అంతటా అదరగొడుతోంది

వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ఫిదా తర్వాత అందుకున్న విజయం ఇది. ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఈ సక్సెస్ వెంకీగారితో షేర్ చేసుకోవడం నా అదృష్టం. వెంకీ గారిని థియేటర్‌కు నేనే లాక్కెళ్లాను. వెంకీగారిని ఇంత అద్భుతంగా చూపించినందుకు అనిల్‌కు థాంక్స్. మా నిర్మాత దిల్ రాజుగారి ఫేస్ వెలిగిపోతోందని వ్యాఖ్యానించారు.

బొమ్మ బ్లాక్ బస్టర్

బొమ్మ బ్లాక్ బస్టర్

దిల్ రాజు మాట్లాడుతూ... బొమ్మ బ్లాక్ బస్టర్ అని ప్రేక్షకులు డిసైడ్ చేశారు. అందరికీ థాంక్స్. అనిల్ రావిపూడికి ఇది బెస్ట్ సినిమా అవుతుందని ముందే చెప్పాను. ప్రేక్షకుల నుంచి అలాంటి స్పందనే వస్తోంది. చాలా రోజుల క్రితం వెంకీగారు నటించిన కలిసుందాం రా సినిమా సంక్రాంతికి చూశాను. ఆ సినిమా కూడా ఇలాగే నాన్ స్టాపుగా ఎంజాయ్ చేశా. అలా ఈ సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ సక్సెస్ చేసినందుకు థాంక్స్. ఈ నెల 18 లేదా 19న ఔట్ డోర్లో ఒక భారీ సక్సెస్ ఈవెంట్ నిర్వహించబోతున్నాం. సంక్రాంతి కాబట్టి ప్రేక్షకులు కుటుంబాలతో కదిలి ఈ సినిమా చూస్తున్నారు. చాలా చోట్ల టికెట్స్ దొరకడం లేదనే ఫోన్స్ వస్తున్నాయని తెలిపారు.

ఆ వెలితి కూడా తీరిపోయింది

ఆ వెలితి కూడా తీరిపోయింది

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... మా సినిమాలోని ప్రతి సీన్, ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బేనర్లో ఇదిమూడో చిత్రం. ఈ విజయంతో హ్యాట్రిక్ ఫినిష్ అయింది. నా గత సినిమాలకు ఓవర్సీస్ లో అంత రెవెన్యూ రాలేదు. ఈ సినిమాతో ఆ కోరిక కూడా తీరిపోయిందన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X