చిరు ‘మగధీరుడు’...‘సూపర్ బాలయ్య’.. వెంకీ ‘మిస్టర్ కూల్’!
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఇపుడు ఎన్టీ రామారావు, సావిత్రి లాంటి ప్రముఖుల జీవితాలు సినిమా రూపంలో మన ముందుకు వస్తున్నాయి. భవిష్యత్తులో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లాంటి హీరో జీవిత చరిత్ర బయోపిక్స్ రూపంలో రావోచ్చేమో!
రానా హోస్ట్ చేస్తున్న 'నెం.1 యారి' కార్యక్రమంలో పాల్గొన్న 'ఎఫ్ 2' టీంకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. చిరు, బాలయ్య, వెంకటేష్ మీద బయోపిక్స్ తీయాల్సి వస్తే ఏం టైటిల్ పెడతారు అని అడిగిన ప్రశ్నకు వారి నుంచి ఆసక్తికర సమాధానాలు వచ్చాయి.

మగధీరుడు, సూపర్ బాలయ్య, మిస్టర్ కూల్
చిరంజీవి బయోపిక్ తీస్తే దానికి ‘మగధీరుడు' అనే టైటిల్ బావుంటుందని అనిల్ రావిపూడి, బాలయ్య బయోపిక్ తీస్తే ‘సూపర్ బాలయ్య' టైటిల్ బావుంటుందని వెంకటేష్ తెలిపారు. మరి వెంకీ బయోపిక్ తీస్తే ఏ టైటిల్ బావుంటదనే ప్రశ్నకు వరుణ్ తేజ్ ‘మిస్టర్ కూల్' బావుంటుందని తెలిపారు.

రానా అలాంటోడా?
నెం.1 యారి కార్యక్రమానికి వచ్చిన దాదాపు అందరు స్టార్స్ ‘ప్లేయర్' ఎవరు? అంటే రానా పేరే సూచిస్తున్నారు. తాజాగా వరుణ్ తేజ్ నుంచి కూడా అదే సమాధానం వచ్చింది. దీంతో నిజంగా రానా అమ్మాయితో ఎక్కువ ఎఫైర్స్ నడిపించే ‘ప్లేయర్' అనే వాదనకు బలం చేకూరుతోంది.

బొబ్బిలి రాజా ప్రభాస్‌తో
వెంకటేష్ నటించిన సినిమాలు ఇప్పటి హీరోలతో చేయాల్సి వస్తే.... ఎన్టీఆర్‍తో ‘బొబ్బిలి రాజా' చేస్తే బావుంటుందని అనిల్ రావిపూడి,, కూలి నెం.1 ప్రభాస్‌కు సూటవుతుందని వెంకీ, ‘ప్రేమించుకుందాం రా' రీమేక్ నాకే సూటవుతుందని వరుణ్ తేజ్ తెలిపారు.

ఎఫ్ 2
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన 'ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











