For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  F3 movie pre release review.. ఒకరికి రేచీకటి.. మరొకరికి నత్తి.. ఆ తరహా ఫన్ వర్కవుట్ అయిందా?

  |

  టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు, అగ్ర నటులు సినిమాల జాతర ముగియడంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ప్రేక్షకుల ముందుకు రావడానికి పట్టాలెక్కాయి. లాక్‌డౌన్ కారణంగా వినోదానికి దూరమైన ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడానికి F3 చిత్రం ప్రయత్నం చేస్తున్నది. దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకుడిగా విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్ సందేశ్, తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా, సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే నటించిన ఈ చిత్రం మే 27న రిలీజ్‌కు సిద్ధమైంది. భారీ అంచనాలు పెంచిన ఈ సినిమాలో ప్రధాన అంశాలు ఏమిటంటే?

  F3 Movie Review కుంభస్థలం కొట్టిందా? గురి తప్పిందా? | Filmibeat Telugu
   F3 ఆ తరహా కామెడీ చిత్రం

  F3 ఆ తరహా కామెడీ చిత్రం


  F2 చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ చిత్రానికి ఫ్రాంచైజీగా F3 చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ రావిపూడి రూపొందించారు. వినోదాన్ని ఆశించే ఈ సినిమా గతంలో కడుపుబ్బా నవ్వించిన ఎవడి గోల వాడిదే, జంబలకిడి పంబ, క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి తరహా చిత్రాల మాదిరిగా F3 సినిమా వినోదాన్ని పంచుతుంది అని దిల్ రాజు స్పష్టం చేశాడు.

   ప్రతీ పాత్ర అత్యాశగానే

  ప్రతీ పాత్ర అత్యాశగానే


  F3 మూవీలో ప్రతీ పాత్ర అత్యాశగానే ఉంటుంది. డబ్బు ఎలా త్వరగా సంపాదించాలనే ఆశతోనే ఉంటారు. వారి ప్రయత్నాల్లో జరిగే ఫన్ ఇందులో ఉంటుంది. ఎంత ఫన్ ఉంటుందో అంత మంచి కంటెంట్ ఉంటుంది. ఇందులో డబ్బు గురించి చెప్పే ఫైనల్ కంటెంట్ కూడా అందరికీ నచ్చుతుంది అని అనిల్ రావిపూడి తెలిపారు.

   90 నిమిషాలు ఫుల్ కామెడీ

  90 నిమిషాలు ఫుల్ కామెడీ


  F3 మూవీ నిడివి రెండున్నర గంటలు. ఫస్టాఫ్ 1.15 గంటలు, సెకండాఫ్ 1.15 గంటలు ఉంటుంది. అయితే తొలి భాగంలో 45 నిమిషాలు, సెకండాఫ్‌లో 45 నిమిషాలు.. మొత్తం 90 నిమిషాల కామెడీ ఉంటుంది. కడుపు పట్టుకొని నవ్వే సన్నివేశాలు ఉంటాయి అంటూ దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.

   మెగా హీరో వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ

  మెగా హీరో వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ

  .. F2 మూవీకి మూడింతలు వినోదం F3 ఉంటుంది. 30 సెకన్లకి ఒక 10 నుంచి 20 పంచులు పడిపోతాయి. ఆడియెన్స్ ఒక జోక్‌కు నవ్వేలోపే ఇంకో పంచ్ పడిపోతుంది. F3లో ఫుల్ ఫన్ ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి అని తెలిపారు.

   పూజా హెగ్డే స్పెషల్ సాంగ్

  పూజా హెగ్డే స్పెషల్ సాంగ్


  F3 సినిమాకు మరో ప్రధానమైన ఆకర్షణ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్. వినోదంగా సాగే ఈ సినిమాలో పూజా హెగ్డే గ్లామర్ అదనపు ఆకర్షణగా సాగింది. ఈ సినిమాలో సోనాల్ చౌహన్ గ్లామర్ మరో స్పెషల్ ప్యాకేజ్‌గా ఉంటుంది అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.

  ఒకరికి రేచీకటి.. మరొకరికి నత్తి

  ఒకరికి రేచీకటి.. మరొకరికి నత్తి


  F3 మూవీలో వెంకటేశ్‌కు రేచీకటి లోపం, నాకు నత్తి ఉంటుంది. ఇప్పటి వరకు ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడమే కష్టం. ఫన్ డోస్ పెంచడానికి అనిల్ రావిపూడి నత్తి క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా ఉంటుంది.. అతనికి కనబడదు... వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని స్టార్ చేశాం. అది హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యింది అని వరుణ్ తేజ్ తెలిపారు.

   F3 ప్రీ రిలీజ్ బిజినెస్

  F3 ప్రీ రిలీజ్ బిజినెస్


  F3 మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది.
  తెలుగు రాష్ట్రాల్లో F3 మూవీ చిత్రం 63 కోట్లు, తెలుగేతర రాష్రాల్లో, ఓవర్సీస్‌లో కలిపితే 17 కోట్లతో మొత్తంగా 80 కోట్ల రూపాయాలను రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు సుమారు 70 కోట్లతో రూపొందించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే 40 కోట్ల లాభాలను పంచిందనే వార్త ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

  English summary
  Victor Venkatesh, Mega hero Varun Sandesh and Star producer Dil Raju's F3 movie to hit the Theatres on May 27th. In this occassion, Filmibeat Telugu brings exclusive Pre release review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X