»   » ఎఫ్-45.... రకుల్ ప్రీత్ సింగ్ న్యూ బిజినెస్!

ఎఫ్-45.... రకుల్ ప్రీత్ సింగ్ న్యూ బిజినెస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెలుతోంది. రెండు చేతులా సంపాదిస్తోంది. హైదరాబాద్ లో సొంతగా ఓ ఫ్లాటు కూడా కొనుక్కుంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు బిజినెస్ ప్లాన్స్ వేస్తోంది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును బిజినెస్ రూట్లోకి మళ్లిస్తోంది. ఆల్రెడీ ఇతర హీరోయిన్లు కొనసాగిస్తున్న... సైడ్ బిజినెస్ ట్రెండ్ ను తానూ ఫాలోఅవుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ఎఫ్-45 పేరుతో నడిచే జిమ్ ఫ్రాంజైజీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఫిట్ నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆమె సోదరుడు అమన్ చూసుకుంటారట.

రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్...

F45-Rakul Preet Sing turned an entrepreneur

అమన్ కు ఆల్రెడీ పిట్ నెస్ సెంటర్ బిజినెస్ మీద ఆసక్తి ఉండటంతో.... అతన్ని హైదరాబాద్ పిలిపించి ఈ బిజనెస్ వ్యవహారాలు అప్పగించిందట. ‘నాకు సినిమాల్లో నటించడం, మంచి డైట్ మెయింటేన్ చేస్తూ ఫిట్ నెస్ కాపాడు కోవడం ఎలాగో తెలుసు. నాకు తెలిసిన బిజనెస్ కాబట్టే ఎఫ్-45 ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఫిబ్రవరి 20న లాంచ్ చేస్తున్నాం' అని రకుల్ తెలిపారు.

ఆల్రెడీ ఎన్నో ఫిట్ నెస్ సెంటర్లు ఉన్నాయి...మీకు స్టార్ట్ చేయబోయే ఎఫ్-45 స్పెషల్ ఏమిటి? అనే ప్రశ్నకు రకుల్ సమాధానం ఇస్తూ...సాధారణంగా జిమ్ అంటే ట్రెడ్ మిల్ లాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కానీ ఎఫ్-45 పూర్తిగా డిఫరెంటుగా ఉంటుంది. ఇందో రోప్స్, ట్రావ్లెర్స్ లాంటి ఉంటాయి అంటోంది.

English summary
Rakul Preet has turned an entrepreneur by taking up a franchise of gym F45 in Gachibowli, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu