క్రేజ్ కోసమే కానీ... : ఫేస్ బుక్ అవుతుంది వీళ్లే...ఫేక్ ఐడీలు, అసభ్య ఫొటోలు
హైదరాబాద్ : టెక్నాలిజీ పెరిగే కొద్దీ సుఖాలతో పాటు సమస్యలూ పెరుగుతున్నాయి. మన స్టార్ హీరోయిన్స్ కు ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఎంత క్రేజ్ ఉందో, అంతకు మించి తలనొప్పులూ ఉన్నాయి. హ్యాకింగ్ బ్యాచ్ ఓ ప్రక్కన, వీరి ఫొటోలతో ఫేక్ ఐడీలు తయారు చేసి ఎక్కౌంట్స్ ఓపెన్ చేసి, మోసాలు చేసేవారు మరో ప్రక్కన. హ్యాక్ చేసి, అసబ్య ఫొటోలు పెడుతూ, నోటి కొచ్చింది రాస్తూ వారి ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాల్సి పరిస్ధితి ఇదీ నేటి సోషల్ మీడియాలో సెలబ్రెటీల అవస్ద.
ఓ సెల్ఫీ లేదా సెట్ లో ఓ ఫొటో తీసి పేస్ బుక్ లో పెట్టందే మనశ్సాంతిగా ఉండదు మన హీరోయిన్స్ కు. ఏదీ లేకపోతే భోజనం చేస్తూనో లేక ప్రక్కవాళ్లతో మాట్లాడుతోనో వాళ్లు ఓ ఫొటో తీసి పెట్టేస్తూంటారు. ఎందుకిలా చేస్తున్నారూ అంటే సినిమాకు పబ్లిసిటీ అని కాదు...తమకు పబ్లిసిటీ. తమ క్రేజ్ పెంచుకోవటానికే.
అదే సమయంలో ఫేస్ బుక్ లోనూ స్టార్ హీరోయిన్స్ ఫొటోలు పెట్టేవాళ్లు ఎక్కువయ్యారు. తమ ఫొటోలుపెట్టకుండా సమంత, నిత్యామీనన్, లేక మరొకరో ఫొటోనో పెట్టడం ఆడపిల్లలకు కామన్ అయ్యిపోయింది. కొంతమంది తమ ఐడిండెటీలు దాచుకోవటానికి వీరి ఫొటోలు పెడుతూంటే, మరికొంతమంది ఫేక్ ఐడిలు వీరి ఫొటోలతో క్రియేట్ చేస్తున్నారు. వారిలో మగవాళ్లు కూడా ఉండటం గమనార్హం. అంటే స్టార్ హీరోయిన్ ఫొటో పెట్టి మగవాళ్లు ఛాటింగ్ చేయటం గట్రా చేస్తున్నారు.
ఫేస్ ఐడిలతో ఎక్కౌంట్స్ క్రియేట్ చేసిన వారు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా దొరకకుండా ఒక్కోసారి సమస్యగా తయారువుతున్నారు. ఫేస్ బుక్ ద్వారా వ్యభిచారం వంటివి యధేచ్చగా జరుగుతున్న నేపధ్యంలో ఈ ఫొటోలను ఈ రకంగా వాడుకుంటున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అసలు ఆడవాళ్లను తమ ఫొటోలు ఫేస్ బుక్ వంటివాటిలో ఒరిజనల్ ఫొటోలు కూడా మరో ప్రక్కన పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు.
మరో ప్రక్క హీరో, హీరోయిన్స్ క్రేజ్ ని సోషల్ మీడియాలో వారికు వచ్చే రెస్పాన్స్ ని బట్టి, వారి ఫేస్ బుక్ లైక్ లు , వాటి ట్వీట్స్ కు వచ్చే రీ ట్వీట్స్ ని బట్టి లెక్కేస్తున్నారు. అక్కడ ఎంత ఫాలోయింగ్ ఉంటే వారికి అంత క్రేజ్ ఉన్నట్లు భావిస్తున్నారు. అందుకే సెలబ్రెటీలు సైతం సోషల్ మీడియాపై ప్రత్యేకమైన శ్రద్దను పెడుతున్నారు. హఠాత్తుగా ఈ టాపిక్ ఎందుకు ఎత్తుకున్నాం అంటే ..తమన్నా పుణ్యాన.
తమన్నా అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ రీసెంట్ గా ఒక కోటి లైక్ లను సంపాదించింది. ఈ విషయమై తమన్నా చాలా ఆనందంగా ఉంది. కోటి రూపాయలు ఇచ్చినా కనపడని ఆనందం ఆమెలో కనపడుతోంది. ఈ సందర్బంగా ఆమె ఏమంటోందో చూడండి.
Heres sending millions and million times the love right back at you all for completing 10 million fans on facebook... Thank you for making me feel so special and loved!
Posted by Tamannaah on8 March 2016
మిగతా స్టార్ హీరోయిన్స్ కూడా ఆమెకు ఓ రేంజిలో పోటీ ఇస్తున్నారు. తమన్నాకు ప్లస్ అయ్యింది. తమిళ, తెలుగు భాషల్లో ఆమె హీరోయిన్ గా చేయటం. ఆమె సినిమాలు యూత్ కు బాగా కనెక్ట్ అవటం అంటున్నారు.

శ్రుతి హాసన్..
తొలి చిత్రం నుంచి శ్రుతి హాసన్ కు పిచ్చ క్రేజ్ వచ్చి పడింది. ఆమె లైక్స్ చెప్తాయి ఎంత క్రేజ్ ఉందో

సమంత
తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమంత గురించి చెప్పేదేముంది చెప్పండి

త్రిష
సీనియర్ అయినా త్రిష ఎప్పుడూ ఫేస్ బుక్ లో యంగ్ బేబీనే

కాజల్
తమిళ, తెలుగు భాషల్లోచెల రేగిపోతున్న కాజల్ కు ఓ రేంజిలో అభిమానులు ఉన్నారు

అనుష్క
బాహుబలి అనుష్క ని పూర్తిగా మార్చేసింది. ఆమె ఫేస్ బుక్ పేజీలో లైక్స్ ని సైతం...

శ్రియ
కెరీర్ అయిపోయందనుకున్న దశలో మనం సినిమాతో మళ్లీ వెలుగులోకి వచ్చింది శ్రియ. ఫేస్ బుక్ ఊపందుకుంది

హన్సిక
తమిళంలో ఎక్కువుగా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడూ తెలుగువైపు చూస్తూన్న ఈ భామకు తమిళులే ఎక్కువ ఫేస్ బుక్కీయులు

తాప్సీ
గుండె ఝల్లుమంది సినిమాతో పరిచయమైన ఈ భామకు హిందీ,తమిళంలోనూ అభిమానులు ఉండటం ఫేస్ బుక్ పరంగా ప్లస్ అయ్యింది

రకుల్ ప్రీతి సింగ్
తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరూ అంటే ఇవాళ రకుల్ ప్రీతి సింగ్ పేరు చెప్పే పరిస్దితి. అలాంటప్పుడు ఫేస్ బుక్ లో ఆమె క్రేజ్ కు లోటేముంటుంది

రెజీనా
రీసెంట్ గా శౌర్యతో పలకరించిన రెజీనాకు ఇప్పటవరకూ సరైన హిట్ పడలేదు. పడిందా..ఫేస్ బుక్ ని దడదడాలించేయ్యదూ

అమీజాక్సన్
ఈ లండన్ భామ..తెలుగు,తమిళ, హిందీ భాషల్లో పెద్ద సినిమాలు చేసి అన్ని చోట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అదే ఫేస్ బుక్ కుట్రాన్సఫర్ అవుతోంది.

హెబ్బా పటేల్
స్టార్ హీరోయిన్ కానక్కర్లేదు...కుర్రాళ్ళ మనస్సుల్లోకి దూసుకుపోతే చాలు..అదే ఈమె ఫేస్ బుక్ లైక్స్ సీక్రెట్

కేధరిన్
అల్లు అర్జున్ వంటి స్టార్ తో నటించినా కేధరిన్ కు రావాల్సిన పేరు రాలేదంటారు. అయితేనేం ఆమెపేరు ఫేస్ బుక్ లో మారు మ్రోగుతోంది

నిత్యామీనన్
అలా మొదలైంది అంటూ తెలుగు కుర్రాళ్ల గుండెలని గిలగింతలు పెట్టి గుండే జారి గల్లంతైందనే ఈ భామకు మళయాళ, తమిళ, తెలుగు ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ ఫాలోయింగ్

అదా శర్మ
హార్ట్ ఎటాక్ తో పూరి పరిచయం చేసిన ఈ బామ..ఫేస్ బుక్ లోచాలా ఎక్టివ్ గా ఉంటూంటుంది. రీసెంట్ గా క్షణం తో హిట్ కొట్టి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచేసుకుంది

లావణ్య త్రిపాఠి
ఈ మద్యనే సోగ్గాడుతో జతగట్టిన ఈ భామ మొన్నీ మద్యన నానితో భలే భలేమొగాడివోయ్ తో ముందుకు వెళ్లింది. దాంతో ఆమెకు ఫేస్ బుక్ లో భలేక్రేజ్ క్రియేట్ అయ్యింది

మంచు లక్ష్మీ ప్రసన్న
మోహన్ బాబుకుమార్తె గా కాకుండా ఇండిడ్యువల్ గా తనకంటూ క్రేజ్ క్రియేట్ చేసుకున్న ప్రసన్నకు ఫేస్ బుక్ లో మంచి ఫాలోయింగే ఉంది

ప్రియాంకచోప్రా
తెలుగులో తుఫాన్ చిత్రంతో మనకు పరిచయమైన ప్రియాంక చోప్రా...బాలీవుడ్, హాలీవుడ్ లను ఏలుతోంది. అందుకే ఆ రేంజిలో ఆమెకు ఫాలోయింగ్
మిగతా హీరోయిన్స్ ఫేస్ బుక్ లైక్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం..


Click it and Unblock the Notifications











