అశ్లీలత ఎఫెక్ట్: పూనమ్ పాండేకు ఫేస్‌బుక్ షాక్
హైదరాబాద్: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ ముంబై మోడల్ పూనమ్ పాండేకకు షాక్ ఇచ్చింది. ఆమె ఫేస్ బుక్ ఖాతాను తొలగించింది. ఆమె తన ఫేస్ బుక్ పేజీలో అశ్లీలత ఎక్కువ కావడంతో ఫేస్ బుక్ యాజమాన్యం ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
తన పబ్లిసిటీ పెంచుకోవడానికి పూనమ్ పాండే గత కొంత కాలంగా సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటిని విరివిగా వినియోగిస్తోంది. తనకు సంబంధించని హాట్ హాట్ ఫోటోలు, అర్ధనగ్న ఫోటోలు, అందాలతో రెచ్చ గొట్టే వీడియోలు పోస్టు చేస్తూ యువతలో తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అయితే తన ఫేస్ బుక్ పేజీ తొలగించడంతో పూనమ్ పాండే ఒక్కసారి షాక్‌కు గురైంది. ఈ పేజీలో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. 'నా ఫేస్ బుక్ పేజీ తొలగించడం చాలా బాధగా ఉంది. ఏ చేస్తే నా ఫేస్ బుక్ అకౌంట్ మళ్లీ వెనక్కి వస్తుందో చెప్పండి' అంటూ ట్విట్టర్ ద్వారా అడుగుతోంది పూనమ్.
పూనమ్ పాండే ఫేస్ బుక్ పేజీ తొలగింపుపై ఆ అమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా....... పూనమ్ పాండే లాంటి వారికి ఇలా జరుగాల్సిందే. అసలు ఇలా అశ్లీల చర్యలకు పాల్పడే వారిని సోషల్ మీడియాలోకి అనుమతించవద్దని మరికొందరు అంటున్నారు.


Click it and Unblock the Notifications











