జియాకు న్యాయం కోసం ఫేస్‌బుక్ పేజీ
ముంబై : ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటి జియా ఖాన్...సూసైడ్ నోట్ బయట పడటంతో ఆమె మరణం వెనక ఎన్నో దిగ్బ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసి ఎంతో మంది చలించి పోయారు.
జియా ఖాన్ రాసిన సూసైడ్ లేఖలో.....సూరజ్ ఎలాంటి వాడో, ఆమెను మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎలా హింసించాడో స్పష్టమయింది. ఈ లేఖ వెలుగులోకి రావడంతో పోలీసులు ఇప్పటికే సూరజ్‌ను అరెస్టు చేసారు. లేఖ ఆధారంగా పోలీసుల విచారణ ముందుకు సాగుతోంది.
ముంబై కోర్టు సూరజ్‌ను ఈ నెల 13 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.....జియా ఖాన్ మరణం వెనక విషయాలు తెలుసుకుని ఎంతో మంది ఆమె కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు.
తాజాగా ప్రముఖ సోషల్ నెట్కర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్ లో 'జస్టిస్ ఫర్ జియా ఖాన్' అనే పేజీని క్రియేట్ చేసారు. ఆమెకు మద్దతుగా నిలుస్తున్న వారు ఈ పేజీని లైక్ చేయడంతో పాటు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అందుకు సంబంధించిన యూఆర్‌ఎల్ ఇదే. (www.facebook.com/Justice.For.Jiah.Khan).


Click it and Unblock the Notifications












