twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నోసార్లు అవమానాలు: రకుల్ ప్రీత్ ఇంత బాధ పడిందా!?

    టాలీవుడ్‌లో అరంగేట్రం తర్వాత నాకెవరూ రెడ్‌ కార్పెట్‌ పరిచి అవకాశాలు ఇచ్చేయలేదు. నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను .అని చెప్పింది రకుల్

    |

    రెండుసార్లు మిస్‌ ఇండియా ఫైనల్స్‌కి వెళ్ళడమే కాకుండా నాలుగు సబ్‌ టైటిల్స్‌ గెల్చుకొని మోడలింగ్‌ ఫీల్డ్‌కి వెళ్ళి ఆ తర్వాత కన్నడలో 'గిల్లి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది అందాల హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.తర్వాత నెమ్మదిగా టాలీవుడ్ లోకి డుగుపెట్టినా మొదట్లో కెరీర్ మొత్తం నత్తనడకే అయ్యింది.

    కానీ త్నని తాను ప్రూవ్ చెసుకుంటూ.. ప్రస్తుతం తెలుగు స్టార్‌ హీరోల సినిమాల్లో మెరుస్తూ టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది ఉత్తరాది భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అయితే మొదట్లో సందీప్‌ కిషన్‌ నటించిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' వంటి హిట్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత రెండేళ్లు ఆమెను పట్టించుకోలేదు. ఆ సమయంలో తాను చాలా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పింది రకుల్‌.

    Faced insults in film industry Rakulpreeth singh

    'టాలీవుడ్‌లో అరంగేట్రం తర్వాత నాకెవరూ రెడ్‌ కార్పెట్‌ పరిచి అవకాశాలు ఇచ్చేయలేదు. నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. చాలా సినిమాల్లో ముందు నన్ను తీసుకునేవారు. ఆ తర్వాత నన్ను తీసేసి వేరే హీరోయిన్‌ను పెట్టుకునేవారు. చాలా సందర్భాల్లో నన్నెందుకు తీసేశారో కారణం కూడా చెప్పేవారు కాదు.

    ఇవన్నీ నాకు పాఠాలుగా మిగిలాయి. కెరీర్‌ మొదట్లోనే చాలా షాక్‌లు తిన్నాను. ఇప్పుడు షాక్‌లు తిని తట్టుకోవడం ఎలాగో నేర్చుకున్నాన'ని రకుల్‌ చెప్పింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' నుంచి పండుగ చేస్కో.. వరకు డీ గ్లామర్‌గానే కన్పిస్తాను. ఆ తర్వాత వచ్చిన 'బ్రూస్‌లీ', 'నాన్నకు ప్రేమతో' చిత్రాల్లో గ్లామర్‌గా కన్పించాను. నాకు ఏదైనా పాత్ర చెప్పినప్పుడులో అందులో దాని ప్రాధాన్యత గమనిస్తాను కానీ.. మేకప్‌ గురించి పెద్దగా పట్టించుకోనని''చెప్పింది రకుల్.

    English summary
    Tollywood heroine Rakul Preeth Singh says that She faced lot of Troubles in Film Industry
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X