అల్లాడిస్తోంది: ఆమెలో ఆ రెండు నిండుగా ఉన్నంతకాలం ఢోకాలేదు!

By Bojja Kumar

బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది. భారతీయ భామలే ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు నానా తంటాలు పడుతుంటే ఎలాంటి భారతీయ మూలాలు లేకుండా, ఇండియన్ కల్చర్ తో ఎలాంటి సంబంధం లేకుండా పెరిగిన ఒక విదేశీ భామ ఇన్నాళ్లు ఇండియన్ ఎంటర్టెన్మంట్ రంగంలో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు.

Recommended Video

Amy Jackson Latest Hot Photoshoot
 ఆ రెండూ నిండుగా ఉన్నంతకాలం ఢోకాలేదు

ఆ రెండూ నిండుగా ఉన్నంతకాలం ఢోకాలేదు

అమీ జాక్సన్ ఇన్నేళ్లు పోటీని తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడిందంటే కారణం.... అందంతో పాటు నటన పరంగా కూడా ఆమెలో విషయం ఉంది కాబట్టే సాధ్యమైంది. అందం, నటన.... ఈ రెండు ఆమెలో నిండుగా ఉన్నంతకాలం ఇండియన్ సినీ పరిశ్రమలో ఆమె కెరీర్‌కు ఢోకా లేదు అని విశ్లేకులు అంటున్నారు.

 2018లో ఆమె దశ తిరగబోతోందా?

2018లో ఆమె దశ తిరగబోతోందా?

2018లో అమీ జాక్సన్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన ‘2.0' సినిమా విడుదల కాబోతోంది. 450 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆమె ఆడ రోబోగా కనిపించబోతోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినీ పరిశ్రమకే పరిమితమైన అమీ జాక్సన్ కెరీర్.... ఈ చిత్రం తర్వాత మలుపు తిరగే అవకాశం ఉందని అంటున్నారు.

 అందంతో అల్లాడిస్తోంది

అందంతో అల్లాడిస్తోంది

ఫారిన్ బ్యూటీస్ అంటేనే అందాల ఆరబోతలో విచ్చలవిడితనం ఉంటుంది. మోడలింగ్ రంగం నుండి వచ్చిన అమీ జాక్సన్ కూడా బ్రిటన్లో మోడల్ గా ఉన్న రోజుల్లో కూడా అలానే చేసింది. అదే తీరు ఇక్కడ కొనసాగించి ఉంటే ఆమెపై విమర్శలు వచ్చేవి. అయితే ఇండియన్ కల్చర్ గురించి ముందే తెలుసుకున్న అమీ జాక్సన్ తన హద్దుల్లో ఉంటూనే.... తన అందంతో ఇక్కడి కుర్రకారును అల్లాడిస్తోంది.

 ఆకట్టుకునే నటన

ఆకట్టుకునే నటన

కేవలం అందం పరంగా మాత్రమే కాదు.... ప్రేక్షకులను మెప్సించే స్థాయిలో నటన, భావోద్వేగాలు పలికించే టాలెంట్ ఉండటంతో అమీ జాక్సన్ ఇన్నాళ్లు ఇటు సౌత్ సినిమాలతో పాటు అటు బాలీవుడ్ చిత్రాల్లోనూ అవాకాశాలు దక్కించుకుంటోంది.

 హార్డ్ వర్కర్

హార్డ్ వర్కర్

సినిమా ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ చేస్తూ, క్రమ శిక్షణతో మెలిగే వారికే లైఫ్ ఉంటుంది. ఎంత అందం, టాలెంట్ ఉన్నా.... ఈ రెండు లేకుంటే నిలదొక్కుకోవడం కష్టమే. పని విషయంలో కూడా అమీ జాక్సన్ చాలా డెడికేషన్‌తో ఉంటుంది కాబట్టే ఆమె ఇంత లాంగ్ పీరియడ్లోనూ సక్సెస్ రేటుతో ముందుకు సాగుతోంది.

 సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తూ

సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తూ

ఏది పడితే ఆ సినిమా కాకుండా.... సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తూ అమీ జాక్సన్ తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటోంది.ఆమె కెరీర్లో ఐ, 2.0 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి.

 అమీ జాక్సన్

అమీ జాక్సన్

అమీ జాక్సన్ 2010లో విడుదలైన మద్రాసి పట్టణం అనే తమిళ సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ 8 ఏళ్ల కాలంలో దాదాపు 15 సినిమాలు చేసింది. అన్ని సినిమాలు పెద్ద బేనర్లు, మంచి పేరున్న డైరెక్టర్ల సినిమాలే కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X