పూనమ్ కౌర్ ఆత్మహత్యాయత్నం వెనుక నిజాలు ఇవేనట. వివాదంలోకి త్రివిక్రమ్.. సోషల్ మీడియాలో వైరల్..

By Rajababu

Recommended Video

పూనమ్ సూసైడ్ వెనుక నిజాలు ఇవేనట ! సోషల్ మీడియాలో వైరల్..!

సినీ నటి పూనమ్ కౌర్, క్రిటిక్ మహేష్ కత్తి మధ్య చోటుచేసుకొన్న వివాదం అనేక మలుపులు తిరుగుతున్నది. పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో తన మీద విమర్శలు చేసిన నేపథ్యంలో కత్తి మహేష్ సోషల్ మీడియాలో స్పందించారు. పవన్‌కు ఆరో భార్యగా ఉంటానని చెప్పింది. అందుకే ఆమెకు పవర్‌స్టార్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌ పదవిని కట్టబెట్టారు అని విమర్శలు చేశారు. ఆదివారం సోమాజిగూడలో నిర్వహించే చర్చకు రావాలని పూనమ్ కౌర్, పవన్ కల్యాణ్‌కు కత్తి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

కత్తిలాంటి ఆరు ప్రశ్నలకు సమాధానం

కత్తిలాంటి ఆరు ప్రశ్నలకు సమాధానం

ఆదివారం సోమాజిగూడలో జరిగిన మీడియా సమావేశంలో పూనమ్‌కు పదవి ఎలా వచ్చింది? గోత్ర నామాలతో పవన్‌తో కలిసి పూనమ్ కౌర్ పూజలు? పూనమ్ ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించింది? లాంటి ఆరు ప్రశ్నలకు సమాధానిమివ్వాలని కత్తి మహేష్ డిమాండ్ చేశారు.

 జల్సా చిత్రంలో పూనమ్ కౌర్

జల్సా చిత్రంలో పూనమ్ కౌర్

కత్తి మహేష్ సంధించిన ఆరు ప్రశ్నలకు సమాధానంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చక్కర్లు కొడుతున్నది. అవి జల్సా సినిమా మొదలు పెడుతున్న రోజులు ..

కమిలిని ముఖర్జీ పాత్రకి తొలుత పూనమ్ కౌర్ ని తీసుకోవడం జరిగింది .

అపుడే ప్రేక్షకాదరణ పొందుతున్న పూనమ్‌కు జల్సా ఆఫర్ చాలా పెద్దది. ఆ సమయంలో జల్సా ఆఫర్ వచ్చినందుకు డేట్స్ లేకపోయినా మిగితా అవకాశాలు వదులుకని జల్సాను ఒప్పుకొన్నది.

 పూజలో పవన్‌తో పూనమ్ కౌర్

పూజలో పవన్‌తో పూనమ్ కౌర్

జల్సా సినిమా సందర్భంగా జరిగిన పూజలలో పూనమ్ కౌర్ ఉండటానికి అదే కారణం ....

ఆ తర్వాత త్రివిక్రమ్ జల్సా సినిమా నుంచి ఆమెను తప్పించి కమిలిని ముఖర్జీని తీసుకున్నారు.

 పూనమ్ కౌర్ కెరీర్ దారుణంగా

పూనమ్ కౌర్ కెరీర్ దారుణంగా

జల్సా సినిమా నుంచి తప్పించడం కారణంగా పూనమ్ కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. దాంతో అప్పటి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తన కోపాన్ని పెంచుకొన్నట్టు సమాచారం.

 సూసైడ్‌కు కారణమిదే

సూసైడ్‌కు కారణమిదే

జల్సా సినిమా నుంచి తనను తప్పించడంపై మనస్తాపం చెందిన పూనమ్ కౌర్ ఆత్మాహత్యాయత్నం చేసినట్టు సమాచారం. పూనమ్ కౌర్ సూసైడ్ విషయం తెలుసుకొన్న పవన్ కల్యాణ్ ఆమెను పరామర్శించినట్టు తాజా పోస్ట్ సారాంశం.

పూనమ్‌కు పవన్ కల్యాణ్ ఓదార్పు

పూనమ్‌కు పవన్ కల్యాణ్ ఓదార్పు

జల్సా నుంచి తప్పించడం వెనుక ప్రత్యక్షంగా పూర్తి కారణం ఏమీలేకపోయినా పూనమ్‌ ఓదార్చి హాస్పిటల్ బిల్ కూడా పవన్ కట్టినట్టు పోస్టులో పేర్కొన్నారు. అప్పుడే పూనమ్‌ను ఉన్నత స్థితికి చేర్చుతానని ఆమె తల్లికి కూడా మాట ఇచ్చారట.

పూనమ్ ఉన్నతస్థితికి పవన్ హామీ

పూనమ్ ఉన్నతస్థితికి పవన్ హామీ

ఆ క్రమంలోనే ఏపీ రాష్ట చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవికి తనే సిఫారసు చేసినట్టు పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను కత్తి మహేష్ తన అస్త్రాలుగా చేసుకోవడం తెలిసిందే.

పవన్ కల్యాణ్ చేసింది తప్పా?

కత్తి మహేష్ వేసిన ప్రశ్నలకు పూనమ్ కౌర్ స్పందించవచ్చు లేదా స్పందించకపోవచ్చు. కానీ రేపు మరొకడు వచ్చి కాజల్ మీద సమంత మీద ఇలాంటి ప్రశ్నలే వేసి సమాధానం చెప్పాలి అంటాడు

రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు సమాధానం చెప్పమంటాడు , చెప్పాలా ?ఇపుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పా ?ఆయనను గౌరవించకుండా ఎలా ఉండ మంటారు ..నిజం అందరికి తెలియాలి అని పవన్ అభిమానులు ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X