2010 సంవత్సరంలో ఆ దర్శకులదే హవా!
రాబోయే 2010లో ఈ మద్య కాలంలో ఫేడ్ అవుట్ అయిన తెలుగు దర్శకులు చాలామంది తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో డా.దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, ఎ.కోదండరామిరెడ్డి, ఇ.వి.వి.సత్యన్నారాయణ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులు ఉన్నారు. వీరి ప్రేరణతో మరికొంత మంది మళ్ళీ మెగా ఫోన్స్ పట్టుకునే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి 2010 ఆ కాలం దర్శకులదే హవా అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ దర్శకులు తమ సినిమా షూటింగ్ లు, స్క్రిప్టులు ప్రారంభించారు. విశ్వనాద్ గారు అల్లరి నరేష్, మంజరి కాంబినేషన్ లో సుమధురం అనే చిత్రం ప్రారంభిస్తున్నారు. రాఘవేంద్రరావు గారు ఇప్పటికే మనోజ్ హీరోగా ఎస్.పి.బాలసుబ్రమణ్యం అనే సంగీత ప్రధాన చిత్రం షూటింగ్ ప్రారంభించారు. మరో ప్రక్క దాసరి నారాయణ రావు..అంతా కొత్తవారితో 'యంగ్ ఇండియా" ని తనదైన శైలిలో ఓ చిత్రం ప్రారంబించారు. హాస్య చిత్రాల దర్శకుడు ఇవివి సత్యనారాయణ అయితే బెండు అప్పారావు తో తన సత్తా చూపించి తాజాగా తన ఎవడి గోల వారిదే చిత్రం సీక్వెల్ ని తన 50వ చిత్రంగా రెడీ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక 2009 లో సూపర్ హిట్ అరుంధతి ఇఛ్చిన కోడి రామకృష్ణ కాజల్ ప్రధాన పాత్రలో ఎమ్.ఎస్.రాజు నిర్మాతగా చండీ అనే చిత్రాన్ని రూపొందించే పనిలో పడ్డారు. వీరితో పాటు కోదండరామిరెడ్డి, బి.గోపాల్ లు 2010లో భారీ చిత్రాలకు నిర్ధేశకత్వం చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











