హీరోయిన్ నజ్రియా వివాహ వేడుక (ఫోటోస్)
హైదరాబాద్: మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్....గురించి మీకు పరిచయం ఉండే ఉంటుంది. అమ్మడు తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించక పోయినా, ఎన్టీఆర్ 'రభస'లో నటించబోతోందంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. అంతేకాక తమిళంలో ధనుష్‌తో నటించిన ఓ సినిమాలో బొడ్డు సీన్ విషయంలో రచ్చరచ్చ చేసి వివాదాస్పద హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ విషయంలో హీరోయిన్ నయనతార, నజ్రియా మధ్య మాటల యుద్దం జరిగింది.
ఆ సంగతి పక్కన పెడితే నజ్రియా వివాహం మళయాల నటుడు ఫహాద్ ఫాజిల్‌తో ఈరోజు(ఆగస్టు 21) తిరువనంతపురంలో జరిగింది. త్రివేండ్రంలోని అల్-సాజ్ కన్వెన్షన్ సెంటర్లో వివాహ వేడుక జరిగింది. ముస్లిం మత సాంప్రదాయ ప్రకారం వీరి వివాహ వేడుక జరిగింది. వెడ్డింగ్ గిప్టుగా వరుడు పహాద్... వధువు నజ్రియాకు డైమండ్ నెక్లెస్ బహూకరించాడు. సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో నజ్రియా ఎంతో అందంగా మెరిసి పోయింది.
అతిథుల కోసం ఘుమఘమలాడే 70 రకాల ప్రత్యేక వంటకాలు తయారు చేయించారు. ఈ వివాహ వేడుకకు మళయాల నటులు సురేష్ గోపి, రాధిక, డైరెక్టర్ ప్రియదర్శన్, లిస్సీ, డైరెక్టర్ షాజి కైలాస్, మీనా నందన్, గౌతమి నాయర్ ఇలా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహ వేడుక పూర్తిగా ప్రైవేటు కార్యక్రమగా జరిగింది. స్లైడ్ షోలో వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు...

పహాద్-నజ్రియా
వివాహ వేడుక సందర్భంగా నజ్రియా మెడలో గులాబీ మాల వేస్తున్న పహాద్ ఫాజిల్.

డైమండ్ నెక్లెస్
వెడ్డింగ్ గిప్టుగా వరుడు పహాద్... వధువు నజ్రియాకు డైమండ్ నెక్లెస్ బహూకరించాడు.

వివాహ వేడుక
నజ్రియా, పహాద్ వివాహ వేడుకకు సంబంధించిన దృశ్యం.

మేకప్ రూంలో..
వివాహానికి ముందు మేకప్ రూపంలో ఇద్దరూ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

సందడి
నజ్రియా వివాహ వేడుక సందర్భంగా వారి ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది.

వివాహం అనంతరం..
వివాహం అనంతరం అభిమానులకు అభివాదం చేస్తున్న పహాద్, నజ్రియా.

చూడ ముచ్చటైన జంట
నజ్రియా, పహాద్ చూడముచ్చటైన జంటగా పలువురు ప్రశంసలు అందుకున్నారు.

సాంప్రదాయ బద్దంగా...
నజ్రియా, పహాద్ వివాహ వేడుక ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగింది.

డిన్నర్
వివాహ విందు సంద్భంగా 70 రకాల వంటకాలను అతిథులకు వడ్డించారు.

ప్రియదర్శన్
నజ్రియా వివాహ వేడుకకు భార్యతో కలిసి హాజరైన దర్శకుడు ప్రియ దర్శన్.

అందాల బొమ్మ
మేకప్ రూపంలో వివాహ అలంకరణ సందర్భంగా తీసిన ఫోటో ఇది.


Click it and Unblock the Notifications











