Pushpa 2 Story Leak : 'పుష్ప' రాజ్‌పై రివెంజ్ .. ఎలా ఉండబోతుందో చెప్పేసిన షెకావత్ సార్
దేశవ్యాప్తంగా సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'పుష్ప: ది రూల్' కూడా ఒకటి. పు'ష్ప'కు కొనసాగింపుగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రమిది. అయితే ఈ చిత్ర మొదటి భాగంలో బన్నీతో తలపడే ఇన్‌స్పెక్టర్ భన్వర్ సింగ్ షెకావత్ ను ఎవ్వరూ మర్చిపోలేరు. రెండో భాగంలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరికీ ఆసక్తిగా ఉంది. అయితే తాజాగా రెండో భాగంలో తన పాత్ర ఎలా ఉండబోతుందో వివరించారు ఫహాద్ ఫాజిల్. ఆయన ఏం చెప్పారంటే...
తెలుగు చిత్రసీమతో పాటు పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ముందు భారీ రికార్డు సృష్టించిన సినిమా 'పుష్ప పార్ట్'. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా.. బాలీవుడ్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా హీరోగా క్రేజ్ తెచ్చిపెట్టింది. దర్శకుడు సుకుమార్ తనదైన స్టైల్ లో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించింది. ఇక ఈ సినిమాలోని ప్రతి డైలాగ్, పాట కూడా ఆడియెన్స్ తెగ ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట అవి వినిపిస్తూనే ఉంటాయి.

భారీ కలెక్షన్లు.. భారీ అంచనాలు.. :మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూళ్లు చేసింది. తెలుగులోనే కాకుండా ముఖ్యంగా హిందీలోనూ రూ.100కోట్లకు పైగా వసూళ్లు చేసింది. దీంతో అందరి దృష్టి రెండో భాగంపైనే పడింది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు రీసెంట్ గా సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్, టీజర్ కు ఊహించ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి నుంచి ఉన్న అంచనాలు మరింత ఎక్కువైపోయాయి.

భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర.. :అయితే ఈ సినిమా మొదటి పార్ట్ లో అల్లు అర్జున్ తో తలపడే ఇన్‌స్పెక్టర్ భన్వర్ సింగ్ షెకావత్ ను అస్సలు ఎవ్వరూ మర్చిపోలేరు. ఆయన తక్కువ సేపే ఉన్నా సినిమా చివర్లో అంచనాలు భారీగా పెంచేశారు. తెరపై కనిపించింది కొద్దిసేపైనా తన డైలాగులతో 'సార్ షెకావత్ సార్' అంటూ ఈలలు వేయించారు. దీంతో రెండో భాగంలో కూడా షెకావత్.. పుష్పను ఎలా పగా తీర్చుకుంటాడనే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా నెలకొంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహాద్ ఫాజిల్.. తన పాత్ర షెకావత్ ఎలా ఉండబోతుందా అని వివరించారు.

"పుష్ప' సెకండ్ పార్ట్ లో భన్వర్ సింగ్ పాత్ర ఎక్కువ సేపు ఉంటుంది. హీరోకు షెకావత్ కు మధ్య చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ రెండో భాగం ఎక్కువగా గొడవల మధ్య జరుగుతుంటుంది" అని చెప్పారు. దీంతో బన్నీ అభిమానులంతా తెగ సంబరపడిపోతున్నారు. ఇకపోతే ఈ సీక్వెల్‌లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర చిత్రీకరణ పూర్తైనట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











