రాజమౌళి పేరుతో #RRR మోసం... నిర్మాతల ముందస్తు హెచ్చరిక!
బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ మల్టీ స్టారర్ మూవీ ప్రస్తుతం బల్గేరియాలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
రాజమౌళి లాంటి మెగా డైరెక్టర్ చిత్రంలో నటించాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఒక్క అవకాశం వస్తే తమ టాలెంట్ నిరూపించుకోవాలని తపనపడే నటులు, న్యూ టాలెంట్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు. ఇదే అదునుగా అలాంటి వారిని బురుడీ కొట్టించి సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు రంగంలోకి దిగారట.

RRR కాస్టింగ్ కాల్ పేరుతో మోసాలు
RRR చిత్రంలో నటించడానికి నటీనటులు కావాలెను అంటూ ఇటీవల ఫేక్ కాస్టింగ్ కాల్ ప్రకటనలు వెలువడటం నిర్మాతల దృష్టికి వచ్చింది. కొందరు కేటుగాళ్లు ఆయా నటుల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు, లొంగ దీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
నిర్మాతల ముందస్తు హెచ్చరిక
RRR మూవీ కోసం రాజమౌళి నటీనటుల కోసం వెతుకుతున్నట్లు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా సైట్లలో కాస్టింగ్ కాల్ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి RRR చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టెన్మెంట్స్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నకిలీ కాస్టింగ్ కాల్ ప్రకటనలు చూసి మోసపోవద్దు అని... డివివి సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.

ఏ విషయమైనా అధికారిక ఖాతా ద్వారా వెల్లడిస్తాం
RRR చిత్రానికి సంబంధించిన ఏ విషయం అయినా డివివి సంస్థ అధికారిక ఖాతా ద్వారా వెల్లడిస్తాం. RRR పేరుతో వచ్చే నకిలీ ప్రకటనలను చూసి మోసపోవద్దు అని డివివి సంస్థ హెచ్చరించింది. అయితే ఈ సంస్థ ట్విట్టర్ ద్వారా ఫేక్ కాస్టింగ్ కాల్స్ మీద ప్రకటన విడుదల చేసే వరకు విషయం వచ్చిందంటే ఇప్పటికే ఇలాంటి మోసాలు చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

RRR
RRR మూవీ విషయానికొస్తే.... స్వాతంత్ర్యం పూర్వం బ్రిటిష్ కాలం నాటి బ్యాక్‌డ్యాప్ ఈ చిత్రం సాగుతోంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. నిజ జీవిత పాత్రల ఆధారంగా రూపొందించిన కల్పిత కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్ అంచనాలతో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











