‘మొగిలి రేకులు’ హీరో పేరుతో అమ్మాయిలను మోసం

బింకా చదువుతున్న గోపీనాత్ నటుడు సాగర్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసాడు. సాగర్ పేరుతో ఆన్ లైన్లో అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ, వారితో ఫోన్లో మాట్లాడుతూ వారిని మోసం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న సాగర్ ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు.
నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షప్ 419, 420, ఐటీ యాక్ట్ 66 ప్రకారం కేసు నమోదు చేసారు. తన గురించి నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఉండటంతో షాక్ అయ్యానని, సెలబ్రిటీలంతా ఇలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సాగర్ సూచిస్తున్నాడు.
సాగర్ గురించిన వివరాలు...
'మొగిలి రేకులు' సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందిన సాగర్....ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. సాగర్, మృదుల జంటగా అభీ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిస్తున్న చిత్రంలో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌కు జోడీగా రాశి నటిస్తోంది. గోకుళంలో సీత, సుభాకాంక్షలు, గిల్లిగజ్జాలు చిత్రాల్లో నటించిన రాశి చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంటరీ ఇస్తోంది.


Click it and Unblock the Notifications











