For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మొగిలి రేకులు’ హీరో పేరుతో అమ్మాయిలను మోసం

    By Bojja Kumar
    |

    Fake Facebook Account - Mogali Rekulu Hero Sagar filed a Police Case against Gopinath
    హైదరాబాద్: 'మొగిలి రేకులు' టీవీ సీరియల్ హీరో సాగర్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అమ్మాయిలను మోసం చేస్తున్న ఓ వ్యక్తి ఉదంతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న సాగర్ పోలీసులకు పిర్యాదు చేసాడు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని ఖమ్మం జిల్లా కొల్లూరుకు చెందిన గోపీనాథ్ అనే బికాం విద్యార్థిగా గుర్తించారు.

    బింకా చదువుతున్న గోపీనాత్ నటుడు సాగర్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసాడు. సాగర్ పేరుతో ఆన్ లైన్లో అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ, వారితో ఫోన్లో మాట్లాడుతూ వారిని మోసం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న సాగర్ ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు.

    నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షప్ 419, 420, ఐటీ యాక్ట్ 66 ప్రకారం కేసు నమోదు చేసారు. తన గురించి నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఉండటంతో షాక్ అయ్యానని, సెలబ్రిటీలంతా ఇలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సాగర్ సూచిస్తున్నాడు.

    సాగర్ గురించిన వివరాలు...

    'మొగిలి రేకులు' సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందిన సాగర్....ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. సాగర్, మృదుల జంటగా అభీ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిస్తున్న చిత్రంలో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌కు జోడీగా రాశి నటిస్తోంది. గోకుళంలో సీత, సుభాకాంక్షలు, గిల్లిగజ్జాలు చిత్రాల్లో నటించిన రాశి చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంటరీ ఇస్తోంది.

    English summary
    Mogali Rekulu TV Serial Artist Sagar given a complaint on Gopinath from Kollur, Khammam district in Madhapur Police Station, Hyderabad on his fake Facebook account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more