»   »  మోసపోకండి... పవన్ కళ్యాణ్ పేరుతో బురిడీ!

మోసపోకండి... పవన్ కళ్యాణ్ పేరుతో బురిడీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం కాలం సోషల్ నెట్వర్కింగు వెబ్ సైట్లు రాజ్యమేలుతున్న కాలం. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్ ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. యువత ఎప్పుడూ ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి వెబ్ సైట్లకు అంటిపెట్టుకునే ఉంటున్నారు. ట్రెండుకు తగిన విధంగా పలువురు సినిమా స్టార్లు కూడా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు.

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసి తమకు ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి ఎలా తయారైంది అంటే సోషల్ నెట్వర్కింగులో ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంత గొప్ప అనే రీతిలో తయారైంది.

ఇదే అదునుగు కొందరు ఇతర ప్రయోజనాల నిమిత్తం కొందరు స్టార్స్ పేరుతో ఫేస్ బుక్ పేజీలు క్రియేట్ చేస్తున్నారు. అది నిజంగా సదరు స్టార్ల అఫీషియల్ పేజీయే అనే విధంగా అభిమానులను నమ్మిస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో కూడా ఇలాంటి ఫేక్ పేజీలు ఫేస్ బుక్, ట్విట్టర్లలో దర్శనం ఇస్తున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ పేరుతో ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ పేజీలు లేవని, వాటిలో పవన్ కళ్యాణ్ గురించి వచ్చే స్టేట్ మెంట్లు నమ్మొద్దని అంటున్నారు పవన్ సన్నిహితులు. అవన్నీ బురిడీ రాయుళ్ల పనే అని అంటున్నారు. మరి ఇలాంటి చూసి బురిడీ కొట్టకుండా ఉండాలంటే సోషల్ నెట్వర్కింగుల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచింది.

English summary
Pawan Kalyan team clarified that there is no official Facebook page for the Power Star and requested the media friends to ignore any such claims.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu