నకిలీలతో హీరోయిన్ త్రిష తిప్పలు
ఆ మధ్య నకిలీ న్యూడ్ వీడియోతో ఇబ్బందులు ఎదుర్కొన్న హీరోయిన్ త్రిష తాజాగా తన పేరుతో ఉన్న నకిలీ ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లతో సమస్యలు ఎదుర్కొంటోంది. ఎవరో తన ఐడిని పోలిన ఐడీతో ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి తనకు సంబంధించిన ఫోటోలు అప్ లోడ్ చేస్తూ, తానే స్వయంగా చాటింగ్ చేస్తున్నట్లు వ్యవహారం నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని ఇలాగే ఉపేక్షిస్తే తన గురించిన తప్పుడు సంకేతాలు అభిమానుల్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో......అలర్టయిన త్రిష అసలు ట్విటర్ ఐడిని వెల్లడించింది.
తన అసలు సిసలైన ట్విట్టర్ ఐడీ trishtrashersఅని.... trishatrashers పేరుతో ఉన్న ఐడీ తనది కాదని స్పష్టం చేసింది. తన పేరుతో నకిలీ ఐడీని క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ నకిలీ ఐడీ బ్లాక్ చేయాలని ట్విట్టర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
వెంకీ బాడీగార్డ్ చిత్రం ద్వారా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న త్రిష....ఎన్టీఆర్ హీరోగా వస్తున్న 'దమ్ము' చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











