twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేక్ ఐడీల గోలేంటి.. ‘క్రాక్’ చుట్టూ ఈ రచ్చ ఏంటి.. కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

    |

    సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ఏది నిజమే ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్నాం. ఇక వ్యక్తుల ఖాతాలకు సంబంధించి కొన్ని గుర్తులున్నాయి. కానీ అవి లేని వారి పరిస్థితి మరీదారుణంగా ఉంటుంది. వారు ట్వీట్స్ చేయకపోయినా, ఎలాంటి పోస్ట్‌లు చేయకపోయినా అవి ఫేక్ అని ఎవ్వరూ గుర్తించరు. స్వయంగా సదరు అధికారిక వ్యక్తి రంగంలోకి దిగి.. ఇది తమ ఖాతా కాదని ఖండిస్తే తప్పా ఎవ్వరికీ తెలియదు. తాజాగా క్రాక్ సినిమా చుట్టూ, క్రాక్ ఫస్ట్ సింగిల్ అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేసినట్టుగా కొందరు ఆకతాయిలు పోస్ట్ చేశారు. అయితే అదంతా అవాస్తమని వారిద్దరు ఖండించారు. అసలు ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

    క్రాక్‌తో హ్యాట్రిక్..

    క్రాక్‌తో హ్యాట్రిక్..

    మాస్ మహారాజ రవితేజకు డాన్ శీను, బలుపు వంటి హిట్స్ అందించాడు గోపిచంద్ మలినేని. గత కొన్నేళ్లుగా హిట్ లేక సతమతమవుతున్న రవితేజను.. ఎలాగైనా క్రాక్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేలా చేసేందుకు గోపిచంద్ మలినేని ప్రయత్నిస్తున్నాడు.

    పోస్టర్, టీజర్ వైరల్..

    పోస్టర్, టీజర్ వైరల్..

    క్రాక్ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అంతా సవ్యంగా ఉండుంటే ఈపాటికే థియేటర్‌లో క్రాక్ సందడి చేసేది.

    ఫస్ట్ సింగిల్ అంటూ హల్చల్..

    ఫస్ట్ సింగిల్ అంటూ హల్చల్..

    ఓ వైపు కరోనాతో అంతా మూలన కూర్చుంటే.. ఈ లాక్ డౌన్ వేళ క్రాక్ ఫస్ట్ సింగిల్ రాబోతోందని దర్శకుడు గోపిచంద్ మలినేని పేరిట ఓ ట్వీట్ చేశారు. ఇదే కాకుండా రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ అకౌంట్ పేరు మీదా.. ఈ రకమైన ట్వీటే చేశారు. అయితే అవి ఫేక్ ఐడీలని, అదంతా అవాస్తవమని చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Tollywood Stars Unbelievable Support To Vihayy Devarakonda | Filmibeat Telugu
    ఖండించిన తమన్..

    ఖండించిన తమన్..

    క్రాక్ ఫస్ట్ సింగిల్ పేరిట వచ్చిన ట్వీట్స్, చేసిన ఐడీలు ఫేక్ అని తమన్ కొట్టిపారేశాడు. అది గోపిచంద్ మలినేని అకౌంట్ కాదని, క్రాక్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడనేది తామె చెబుతామని, దాని కోసం పని చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. రామజోగయ్య శాస్త్రి సైతం అది ఫేక అకౌంట్ అని, తనది కాదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇదంతా క్రాక్ చుట్టే ఎందుకు జరిగింది? అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

    English summary
    Fake IDs Are Creating Row On Ravi Teja Krack Movie. Gopichand Malineni And Ramajogaiah Sastry Fake Ids are Creating Row On Krack First Single.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X