RRRపై వైరల్‌గా ఫేక్ న్యూస్.. ఎన్టీఆర్ టీజర్‌పై క్లారిటీ ఇచ్చిన యూనిట్
సోషల్ మీడియా ప్రభావం సినిమాలపై తీవ్ర ప్రభావమే చూపుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా అబద్ధపు ప్రచారాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ప్రమోషన్స్ పరంగా లాభమే అయినప్పటికీ చివరికి ఆ వార్తల్లో తేడా వస్తే అభిమానుల్లో కన్ఫ్యూజన్ మొదలైతే చిత్ర యూనిట్ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇక RRR విషయంలో ప్రస్తుతం అలాంటి వార్త ఒకటి వైరల్ అయ్యింది. ఇక ముందుగానే చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇచ్చింది.
Recommended Video

ప్రతి చిన్న న్యూస్ కూడా..
RRR సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రతి చిన్న న్యూస్ కూడా అభిమానులను ఎట్రాక్ట్ చేస్తుంటుంది. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ టీజర్ డేట్ పై క్లారిటీ ఇస్తున్నట్లు ఒక పోస్టర్ వైరల్ అయ్యింది.

ఎన్టీఆర్ టీజర్ డేట్ కోసం వెయిటింగ్..
కరోనా వైరస్ గోల లేకుండా ఈపాటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యి ఉండేది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను ఏ స్థాయిలోకి తీసుకువెళ్లిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ కొమురమ్ భీమ్ లుక్ కూడా అదే తరహాలో ఆకట్టుకుంటుందని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఫేక్ న్యూస్ వైరల్..
ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురమ్ భీమ్ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ని ఆగస్ట్ 14వ తేదీన సాయత్రం 4.50నిమిషాలకు రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ అవుతోంది. దాదాపు చిత్ర యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేసినట్లు గా ఉన్నా ఆ పోస్టర్ అభిమానులు కూడా నిజమానుకుంటున్నారు. ఇంటర్నెట్ లో వైరల్ అవ్వడంతో చిత్ర యూనిట్ ని సంప్రదించక తప్పలేదు.

క్లారిటీ ఇచ్చిన RRR టీమ్
ఈ న్యూస్ పై RRR టీమ్ ని వివరణ కోరగా ఇంతవరకు అఫీషియల్ గా ఎలాంటి డేట్ అనౌన్స్ చేయలేదు అని వివరణ ఇచ్చారు. దీంతో ఆ పోస్టర్ ఫేక్ అని తేలిపోయింది. ప్రస్తుతం రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కరోనా వైరస్ తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో రిస్క్ చేయడం లేదు. ఆ మధ్య టెస్ట్ షూటింగ్ కోసం ప్లాన్ రెడీ చేసుకున్నప్పటికి మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











