అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్టీఆర్ ఫాన్స్.. ఫేక్ న్యూస్ వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేత చిత్రంతో బిజీగా ఉన్నాడు. గ్యాప్ లేకుండా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి ప్రస్తుతం గర్భవతిగా ఉంది. త్వరలో ఎన్టీఆర్ రెండవ సారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
లక్ష్మి ప్రణతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభయ్ రామ్ కు చెల్లి పుట్టిందని ప్రచారం చేశారు. ఈ వార్తలో ఇటివంటి వాస్తవం లేదని అంతా ఫేక్ అని ఎన్టీఆర్ సన్నిహితులు తేల్చారు.

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి గర్భవతిగా ఉన్న సంగతి వాస్తవమే. ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు వైరల్ అవుతున్న న్యూస్ లో ఎలాంటి వాస్తవం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సామెత మూడవ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











