twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణంగా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోల మార్ఫింగ్.. ఇంటర్నెట్‌లో వైరల్, ఏం జరిగిందంటే!

    |

    అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ జోరు కాస్త తగ్గింది. మునుపటిలా ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు రావడం లేదు. టాలీవుడ్ లో మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో రకుల్ నటించింది. ఇటీవల రకుల్ కు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్ సరసన నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్ దే. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలయింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

     జోరుగా ప్రమోషన్స్

    జోరుగా ప్రమోషన్స్

    దే దే ప్యార్ దే చిత్రంలో అజయ్ దేవగన్ సరసన సీనియర్ హీరోయిన్ టబు, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. టబు అజయ్ దేవగన్ భార్యగా నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ అతడికి ప్రేయసిగా నటిస్తుండడం విశేషం. మే 17న దే దే ప్యార్ దే చిత్రం విడుదల కాబోతోంది. దీనితో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షోలో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది.

    రొమాంటిక్ సాంగ్

    రొమాంటిక్ సాంగ్

    ఇటీవల దే దే ప్యార్ దే చిత్రంలోని రొమాంటిక్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ చీర కట్టులో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయి డాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ వల్లే ప్రస్తుతం రకుల్ ప్రీత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సాంగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ హాట్ గా కనిపిస్తున్న దృశ్యాల్ని కొందరు మార్ఫింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరించారు.

     మార్ఫింగ్

    మార్ఫింగ్

    మార్ఫింగ్ బారీన పడడం హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యే సమస్య. తమ ఫోటోలని కొందరు అసభ్యంగా చిత్రీకరించి వైరల్ చేస్తుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ మార్ఫింగ్ అయిన దృశ్యాలు కొన్ని వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ డాన్స్ చేస్తుంటే అసభ్యంగా కనిపిస్తున్నట్లు ఆ మార్ఫింగ్ లో చిత్రీకరించారు.

    విజయం కోసం

    విజయం కోసం

    ఇక రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే తమిళంలో సూర్య సరసన ఎన్ జి కె లో నటిస్తోంది. అలాగే శివకార్తికేయన్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఇక తెలుగులో కింగ్ నాగార్జున సరసన మన్మథుడు 2లో నటిస్తోంది. వీటిలో కొన్ని చిత్రాలు విజయం సాధించినా రకుల్ కెరీర్ మళ్ళీ పుంజుకున్నట్లే.

    English summary
    Fake photos of Rakul Preet Singh citing that she experienced a nip-slip are doing rounds on social media sites.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X