ఇదేం దారుణం? : రామ్ గోపాల్ వర్మ పేరుతో బన్ని ప్యాన్స్ ని ఆడుకుంటున్నారు

By Srikanya

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ తరుచూ ట్విట్టర్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కెలుకుతూండటం తెలిసిందే. అయితే ఆయన ఎప్పుడూ అల్లు అర్జున్ ని ఏమీ అనలేదు. బన్ని కు సంభందించిన ఏ ఇష్యూలోనూ తలదూర్చలేదు. కానీ తాజాగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసినట్లుగా ఓ ఫేక్ పోస్ట్ బయిలు దేరింది. ఆ పోస్ట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ పోస్ట్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని వర్మ ట్రోల్ చేస్తున్నట్లుగా ఉంది. ఈ మధ్యన సైమా ఓట్లులో ఫేక్ ఓట్లు పడ్డాయని, అది బన్ని అభిమానుల పనే అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాపిక్ ని బేస్ చేసుకుని వర్మ ట్వీట్ చేసినట్లుగా ఓ ట్వీట్ ని యాంటి ప్యాన్స్ ప్రచారంలోకి తెచ్చారు. అయితే రామ్ గోపాల్ వర్మ టైమ్ లైన్ లోకి వెళ్లినవారికి మాత్రం అసలు నిజం తెలుస్తోంది. ఆయన ట్వీట్ చేయలేదని, అసలు ఈ విషయాన్ని ఆయన పట్టించుకోలేదని...మామూలుగా లేరుగా యాంటి ఫ్యాన్స్..రచ్చ రచ్చ చేస్తున్నారన్నమాట.

Fake Posts in the name of director Ram Gopal Varma

ఇక సినిమా అవార్డుల ఫంక్షన్ కు సంబంధించి అదీ ప్రెవేట్ వ్యక్తులు చేత నిర్వహింపబడే ఫంక్షన్స్ లో ఇలాంటి ఫేక్ ఓట్ల వ్యవహారం రావడం ఇప్పుడు సినిమా వర్గాల వారిని ఆశ్చర్య పరుస్తోంది. జూన్ 30 జూలై 1 తేదీలలో సింగపూర్ లో 'సైమా' అవార్డ్స్ ఫంక్షన్ చాల భారీ ఎత్తున జరగబోతోంది.

అయితే ఈసారి తెలుగు సినిమాకు సంబంధించి ఉత్తమ నటుడు అవార్డ్ కోసం ఎంపిక చేసిన నామినేషన్స్ లో మహేష్ ప్రభాస్ అల్లుఅర్జున్ ల పేర్లు నామినేట్ అయ్యాయి. సినిమా రంగానికి చెందిన కొందరు ప్రముఖుల జడ్జి ప్యానల్ తో పాటుగా ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా ఈఉత్తమ నటుడు అవార్డును ఎంపిక చేస్తారు. ఇప్పటికే 'సైమా' అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ ఆన్ లైన్ ఓటింగ్ ప్రారంభం అయింది.

Fake Posts in the name of director Ram Gopal Varma

అయితే మొదటి నుంచీ ఈ పోటీలో ప్రభాస్, మహేష్ ల మధ్య బెస్ట్ హీరో అవార్డ్ కు పోటీ హెచ్చుగా ఉండటంతో వీరిద్దరిలో ఎవరో ఒకరు ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపిక అవుతారనేది ఖరారు అయిపోయింది. అయితే అనుకోకుండా హఠాత్తుగా అల్లు అర్జున్.... ప్రభాస్, మహేష్ లను ఆన్ లైన్ ఓటింగ్ లో దాటిపోవడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.

ఒక్కరోజే అల్లుర్జున్ కు ప్రభాస్ మహేష్ ల కంటే వేలసంఖ్యలో ఓట్లు ఒక్కరోజులోనే అధికంగా రావడం 'సైమా' అవార్డ్స్ కమిటీ నిర్వాహకులను ఆశ్చర్య పరిచింది. దీనితో 'సైమా' సంస్థ ఈ ఆన్ లైన్ ఓటింగ్ పై క్రాస్ చెక్ చేస్తే అల్లుఅర్జున్ కు పడిన ఓట్లలో దాదాపు 30వేల ఓట్లు ఫేక్ ఓట్లని తేలడంతో ఆ ఓట్లను 'సైమా' ఆన్ లైన్ ఓటింగ్ సైట్ నుండి డిలీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X