For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాస్పటిల్ లో లేను..అవన్నీ రూమర్స్ అంటోంది

By Srikanya
|

హైదరాబాద్ : ‘‘హీరోయిన్ బిందు మాధవికి అస్వస్థత/ బిందు మాధవి ఆరోగ్యం బాగోలేదు'' సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలోనూ, వెబ్‌సైట్లలో వస్తున్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి చదివిన బిందుమాధవ్ షాక్ అయ్యింది. దాంతో ఆమె వెంటనే స్పందించింది. అంతేకాదు ఈ ఫొటోని పెట్టి...తాను ఇప్పుడు తీసుకున్న ఫొటోని పంపి..తన క్షేమం తెలిపింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ వార్తలు వాస్తవం కాదని, ఎవరో గాసిప్‌ రాయుడు సృష్టించిన గాలి వార్త అని స్వయంగా బిందు మాధవి స్పష్టం చేసింది.ప్రస్తుతం చెన్నయిలో ప్రముఖ తమిళ నటుడు సూర్య నిర్మిస్తూ నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్‌లో ఉన్న తాను` అస్వస్థతకు లోనవ్వడం, హాస్పిటల్‌లో జాయినవ్వడం.. ఇవన్నీ రూమర్స్ మాత్రమేనని బిందు మాధవి మీడియాకు తెలిపింది.

Fake Rumours On Bindu Madhavi's Health

'ఆవకాయ్ బిర్యానీ" చిత్రం ద్వారా 2008లో తెలుగుతెరపై అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి బిందుమాధవి. ఆ తర్వాత పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్‌కు జోడీగా బంపర్ ఆఫర్, ఓం శాంతి (2009), రామరామ కృష్ణ కృష్ణ, ప్రతిరోజు (2010), పిల్ల జమీందార్ చిత్రాల్లో నటించింది. కానీ ఏవీ ఆమెకు లైఫ్ ఇవ్వలేదు. అలాగే ఈ చిత్రాలతో పాటు మరో మూడు తమిళ చిత్రాల్లోనూ నటించింది.

బిందుమాధవి మాట్లాడుతూ...ఆపర్స్ వస్తున్నాయి కానీ.. వస్తున్న అవకాశాల్లో నచ్చితేనే చేస్తున్నట్లు శెలవిచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం కంటే వాటిలో మంచివి ఎంచుకొని చేయడమే ఉత్తమం. అలా చేస్తేనే పరిశ్రమలో పదికాలాల పాటు హీరోయిన్‌గా నిలదొక్కుకోవచ్చునంటూ బిల్డప్ ఇచ్చింది. ఇది విన్న పరిశ్రమ జనాలు బిందుకు అంత సీన్ ఉందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు ఆమె మాటలు విని నవ్వుకుంటున్నారు.

అలాగే మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈరోజు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎవరైనా ఉంటారా అని షాకింగ్ కామెంట్స్ చేస్తూ బాయ్ ఫ్రెండ్ కల్చర్ లేని సమాజాన్ని చూపెట్టమని మీడియాకు ఎదురు ప్రశ్న వేసింది బిందు మాధవి. అంతేకాదు తనకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అయితే ఆ విషయం తన వ్యక్తిగతమని సమాధానం ఇచ్చింది బిందు మాధవి.

జూనియర్ సిల్క్ గా తనను పోలుస్తూ కామెంట్స్ చేసే వారి పై తనకు ఎటువంటి కోపం లేదని సిల్క్ స్మితతో తనను పోల్చడం తనకు గర్వంగా ఉందని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసిన బిందు మాధవి త్వరలోనే విదేశాలకు వెళ్ళి ఎంటెక్ చేస్తానని చెపుతోంది. అయితే చాలామంది హీరోయిన్స్ లా తాను ఫేస్ బుక్, ట్విటర్ లలో ఏదో ఒక కామెంట్ పెట్టడం తను ఇష్టం లేదు అని చెపుతూ తనకు సెల్ ఫోన్ అంటేనే చికాకు అని చెపుతోంది.

English summary
Bindu Madhavi tweeted "Just got 2 knw tat, few Telugu channels have reported tat am admitted in hospital n in very serious stage.... Pls hold on guys, dnt kill me so early.... Am all Gud in chennai n lukin forward 4 d audio launch of my movie 2mr..."
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more