For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కలకలం రేపిన నితిన్ డైరెక్టర్ ట్వీట్: వాళ్లపై పచ్చి బూతులు.. హీరో ఎంట్రీతో అసలు మేటర్ లీక్

  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి వారే తమ భావాలను ప్రకటిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి వివాదాలకు దారి తీస్తూ ఉంటాయి. అంతేకాదు, ఇలాంటి పోస్టులు మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలకు కూడా కారణం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన పోస్టులు ఎంతటి రచ్చ రచ్చ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతోన్న ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఇప్పుడు వైరల్ అవుతోన్న ట్వీట్.. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ దీనిపై స్పందించాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

  ‘మాచర్ల నియోజకవర్గం’ చేశారు

  ‘మాచర్ల నియోజకవర్గం’ చేశారు

  ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రమే 'మాచర్ల నియోజకవర్గం'. ఇందులో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మించారు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

  టాప్ బటన్స్ విప్పేసిన అషు రెడ్డి: అబ్బో ఇలా చూపిస్తుందేంటి!

  రిలీజ్‌కు సిద్ధంగా.. ప్రమోషన్ షురూ

  రిలీజ్‌కు సిద్ధంగా.. ప్రమోషన్ షురూ

  పక్కా కమర్షియల్ పంథాలో రాబోతున్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీ ఆగస్టు 12న ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే టీజర్, పాటలను కూడా విడుదల చేసింది. అలాగే, ఇంటర్వ్యూలు, ఈవెంట్లను కూడా యూనిట్ ప్లాన్ చేస్తోంది.

  కలకలం రేపిన నితిన్ డైరెక్టర్ ట్వీట్

  కలకలం రేపిన నితిన్ డైరెక్టర్ ట్వీట్

  గతంలో ఎన్నో చిత్రాలను ఎడిటర్‌గా పని చేసి.. ఇప్పుడు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తొలి చిత్రమే అయినా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాల ద్వారా తెలిసింది. ఇక, తాజాగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో వచ్చిన ఓ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

  బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: పైనుంచి చూపిస్తూ హాట్ సెల్ఫీ

  ఆ కులాలపై అనుచిత వ్యాఖ్యలతో


  ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో వచ్చిన ట్వీట్‌ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ గెలిచిన తర్వాత పోస్ట్ చేసినట్లుగా ఉంది. అందులో 'జగనన్న కమ్మ, కాపు **కొడుకుల ** పగలగొట్టాడు. ఇప్పుడు ఏడవండి రా' అని ఉంది. దీంతో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌‌ను పలు పార్టీలకు చెందిన అభిమానులు షేర్ చేస్తూ.. నితిన్ 'మాచర్ల నియోజకవర్గం'పై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.

  హీరో నితిన్ క్లారిటీ.. ఫోటో షేర్ చేసి

  హీరో నితిన్ క్లారిటీ.. ఫోటో షేర్ చేసి


  వివాదం రేపిన ట్వీట్‌పై హీరో నితిన్ స్పందించాడు. తాజాగా అతడు ట్విట్టర్‌లో 'ఒక నకిలీ వ్యక్తి చేసిన ఫేక్ ట్వీట్ అనవసరమైన రచ్చ సృష్టించింది. దురదృష్టవశాత్తు ఇది ఇతరుల మనోభావాలను దెబ్బతీసింది. చాలా విచారకరం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను' అంటూ క్లారిటీ ఇచ్చాడు. అలాగే, రెండు వేరు వేరే ఫొటోలను కూడా షేర్ చేశాడు.

  బ్లేజర్ విప్పేసి రత్తాలు హాట్ ట్రీట్: ఆ పార్ట్ కనిపించేలా ఘాటుగా!

  ట్విట్టర్ ద్వారానే ఆ డైరెక్టర్ క్లారిటీ

  తన పేరుతో ప్రచారం అవుతోన్న ట్వీట్‌పై ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'ఈ స్క్రీన్ షాట్‌లో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్. ఎవరో కావాలని ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ కింద ఉన్న స్క్రీన్ షాట్‌లో ఉన్న పేరు డిఫరెంట్. ఇప్పుడు నా ప్రొఫైల్‌లో ఉన్న పేరు స్పెల్లింగ్ వేరు. ఫొటో షాప్ చేసిన వాడు సరిగా చేయలేదు' అని రాసుకొచ్చాడు.

  నేను వైఎస్సార్ అభిమానినే అని

  నేను వైఎస్సార్ అభిమానినే అని

  ఇదే ట్వీట్‌లో యంగ్ డైరెక్టర్ ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి 'నేను స్వతహాగా వైఎస్ఆర్ అభిమానిని. నేను ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నా అభిప్రాయాన్ని చెప్పాను తప్పా.. వేరే ఏ కులాన్ని కించపరచలేదు. నేను ఒక్క ట్వీట్ కూడా డిలీట్ చేయలేదు. చేయను కూడా' అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

  English summary
  M.S. Rajashekhar Reddy Now Doing Macherla Niyojakavargam Movie With Nithiin. Now Fake Tweet Creates Controversy on This Director.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X