తన పేరు చెప్పి మోసం చేస్తున్నారని శ్రియ గోల
తన పేరు చెప్పి ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేసి కొందరు మోసం చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది శ్రియ. ఆమె ప్రస్తుతం భూపాల్ లో ఉంది. భోపాల్ నగరం చాలా అందంగా ఉందని, అక్కడి ఫుడ్ కూడా రుచికరంగా ఉందని ఆమె అంటున్నారు. బరువు గురించి ఆలోచించకుండా శుభ్రంగా భోపాల్ వంటకాలను ఆరగించేస్తున్నానని శ్రీయ చెప్తోంది. ప్రస్తుతం గల్లీ గల్లీ మే చోర్ హై అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ భోపాల్‌లో జరుగుతోంది. అక్షయ్‌ఖన్నా, శ్రీయ, ముగ్ధా గాడ్సే పాల్గొనగా అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి రమీ జాఫ్రి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ షూటింగ్ విశేషాలను శ్రీయ చెబుతూ రమీ చాలా కూల్‌గా ఉంటారు. ఏ సీన్ తీయబోతున్నారో చెప్పి, మా స్టయిల్‌లో యాక్ట్ చేయమంటారు. హడావిడి పడకుండా రిలాక్డ్స్‌గా షూటింగ్ చేస్తారు. అక్షయ్, ముగ్ధా కూడా చాలా స్నేహంగా ఉంటున్నారు. దాంతో నాకు వర్క్ చేస్తున్న ఫీలింగే కలగడంలేదు. ఈ చిత్రకథ, నా పాత్ర బాగున్నాయి. హిందీలో నాకు బ్రేక్ రావడం ఖాయం అనిపిస్తోంది అన్నారు. ఇదిలా ఉంటే ట్విట్టర్ ద్వారా శ్రీయ తన మనోభావాలు పంచుకుంటుంటారు. దాదాపు లక్ష వరకు ఆమెకు ఫాలోయిర్స్ ఉన్నారు. అయితే ఇటీవల ఎవరో శ్రీయ పేరు మీద ట్విట్టర్‌లో ఓ ఎకౌంట్ సృష్టించారు. అది కూడా శ్రీయదే అని వించి అభిమానులు ఆ ట్విట్టర్‌ని ఫాలో అవుతున్నారు. ఈ విషయం గురించి శ్రీయ చెబుతూ @shriyasmiling అనేది నా నిజమైన ఐడీ. నకిలీలను నమ్మి మోసపోకండి అంది.


Click it and Unblock the Notifications











