మోసం చేసిన వాడిపై సమంత పోలీస్ కంప్లైంట్
సమంత ఇప్పుడు మంచి కాక మీద ఉంది.ఎవరన్నా కదిపితే చాలా సీరియస్ అవుతోంది. దానికి కారణం ఆమె ట్విట్టర్ ఎక్కౌంట్ లో వచ్చిన ఓ ట్వీట్. అందులో ''హాయ్ అండి... రామ్‌చరణ్ సరసన వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది""అని..ఇందులో తప్పేముంది అనిపించవచ్చు.అయితే అస్సలు రీజన్ ఏంటంటే..అస్సలు సమంతకు ట్విట్టర్ ఎక్కౌంటే ేలదు. ఎవరో ఆమె పేరు మీద ట్విట్టర్ ఎక్కౌంట్ ఓపెన్ చేసి ఇలాంటి పోస్టింగ్ లు చేస్తున్నారు.అంతేగాక ఈ ఎక్కౌంట్ కు చాలా మంది ఫాలోయిర్స్ కూడా ఉన్నారు. దాదాపు 24వేల మంది ఈ ట్విట్టర్‌ని ఫాలో అవుతున్నారు. తననే కాక తన ఫ్యాన్స్ ను కూడా ఇలా తన పేరు మీద ట్వీట్స్ ఇస్తూ మోసం చేస్తున్న ఆ వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి సమంత ప్రిపేర్ అవుతోంది.
అందుకు సైబర్ పోలీసులుని సంప్రదించాలని ఆలోచనలో ఉంది. ఇలాంటి తప్పుడు న్యూస్ లు మాత్రమే కాక రేపు తన గురించి ఎలాంటి న్యూస్ లు ఈ ట్విట్టర్ లో వస్తాయో అని భయానికి లోను అవుతోంది.మొదట్లో ఆమెకు ట్విట్టర్ ఎక్కౌంట్ ఉండేది. కానీ కారణమేమో కానీ దాన్ని ఆమె మూసి వేసింది.ఇప్పుడు దాన్ని మరొకరు ఓపెన్ చేసి ఇలా జనాల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తిని కనుక్కుని ఎలాగైనా బుద్ది చెప్పాలనే ఆలోచనలో ఆమె ఉంది. ఇక చరణ్ హీరోగా వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. కాబట్టి సమంత ట్విట్స్ ని ఎవరూ పట్టించుకోకుండా వదిలి వేస్తే ఆమెకు హెల్ప్ చేసిన వారు అవుతారు.


Click it and Unblock the Notifications











