రామ్ చరణ్ పేరుతో నకిలీ దరఖాస్తు

By Bojja Kumar

హైదరాబాద్: దేశంలో ఓటరు గుర్తుంపు కార్డుల జారీ వ్యవస్థ ఎంత అద్వాన్నంగా తయారైందో గతంలో అనేక సంఘటనలు రుజువు చేసాయి. అప్పటి నుంచి చాలా అప్రమత్తంగా ఉంటున్న అధికారులు ఇటీవల తెలుగు సినీ స్టార్ రామ్ చరణ్ పేరుతో వచ్చిన నకిలీ ఓటరు గుర్తుంపు కార్డు దరఖాస్తును పసిగట్టారు. ఆన్ లైన్ దరఖాస్తుల విభాగంలో కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగు చూసింది.

రామ్ చరణ్ తేజను ధర్మవరం ఓటురుగా నమోదు చేయాలంటూ 27939854 ఐడీ నెంబర్‌తో దరఖాస్తు అందింది. ఇందులో అతని ఇంటిపేరు 'బండి', తండ్రి పేరు 'చిరు', వయసు 53 ఏళ్లు, ధర్మవరం పట్టణంలోని రామ్ నగర్ ఏరియాలో 8-6-1969 నెంబరుగల ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. మగధీర చిత్రంలోని రామ్ చరణ్ ఫోటోను జతచేసి ఆన్ లైన్లో దరఖాస్తు చేసారు.

ఫోటో చూడగానే ఇది నకిలీ దరఖాస్తు అని పసిగట్టిన అధికారులు...ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియను అపహాస్యం చేసేలా ప్రవర్తించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X