నోరుపారేసుకొన్న సినీ హీరో విశ్వక్‌సేన్.. ‘పిచ్చి లంxx కొడుకులు’ వ్యాఖ్యలపై వివరణ
ఈ నగరానికి ఏమైంది చిత్రంతో గుర్తింపు పొందిన యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా ఫలక్‌నుమా దాస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాల వరకు విశ్వక్ సేన్ తీరు, ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఫలక్‌నుమా దాస్ సినిమాకు వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన బూతులు మాట్లాడారు. అయితే హీరోల స్థాయికి దిగజారి మాటల వదలడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తన తప్పును తెలుసుకొని వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియాలో విశ్వక్ వీడియో
ఇటీవల సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించిన విశ్వక్ సేన్ కారులో జర్నీ చేస్తూనే వీడియోను రిలీజ్ చేశారు. సోమవారం సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నాం. దానిని ఎక్కడ రిలీజ్ చేస్తామో త్వరలో చెబుతాను. నా సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వారికి సమాధానం చెప్పాలి అని విశ్వక్ సేన్ అన్నారు.

విశ్వక్ సేన్ అనుచిత వ్యాఖ్యలతో
సోమవారం రోజుకు నేను హైదరాబాద్‌కు వస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత చోటే చోటే బచ్చేంఖో మై జవాబ్ దేనా హై.. ఒక్కొక్కడిని దెంగితే షేపులు అవుట్ అవుతరు. పిచ్చి లంజోడుకులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వెంటనే విశ్వక్ సేన్‌పై సోషల్ మీడియాలో మీడియా ప్రతినిధులు, నెటిజన్లు ట్రోల్ చేశారు. మీమ్స్‌తో అల్లడించారు. ఎన్నో గొప్ప సినిమాలు అందించిన సురేష్ ప్రొడక్షన్ నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు అని గట్టిగా ట్రోలింగ్ చేశారు.

ఇండస్ట్రీలో ఇలాంటి హీరోను
సినిమా ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోల సినిమాలపై నెగిటివ్ రివ్యూలు వచ్చాయని, వాటిపై ఎన్నడూ ఏ హీరో కూడా ఈ విధంగా నోరు పారేసుకోలేదు. మెగాస్టార్లు, రెబల్ స్టార్లు, రక రకాల స్టార్లను చూశాం. ఇలా ఎవరూ వ్యవహరించలేదు. రెండు సినిమాలకే ఇలా ప్రవర్తిస్తే.. మున్ముందు ఎలాంటి తీరును చూడాల్సి వస్తుందో అనే మాటలు మీడియాలో వినిపించాయి. విశ్వక్ సేన్ తన స్థాయికి మించి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఘాటుగా వినిపించాయి.

తన వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ వివరణ
తన వ్యాఖ్యలపై వెల్లవెత్తుతున్న నిరసన గ్రహించిన విశ్వక్ సేన్ వివరణ ఇచ్చారు. నేను ఏ రివ్యూ రైటర్‌ను గానీ.. ఏ మీడియా వాళ్లను గానీ.. ఏ హీరోను గానీ విమర్శించలేదు.
నా సినిమా ప్రమోషన్స్‌తో నేను బిజీగా ఉన్నాను. కానీ కొందరు మాత్రం నా సినిమాను కావాలనే టార్గెట్ చేసి.. నష్టం చేయడానికి చూస్తున్నారు. వాళ్లను విమర్శించాను కానీ ఎవర్నీ పర్సనల్‌గా టార్గెట్ చేసి అన్న మాటలు కావు. అని హీరో విశ్వక్ సేన్ వివరణ ఇచ్చారు.

నా సినిమా పోస్టర్లు చింపేసారని
అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో తన సినిమా పోస్టర్లను చింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తున్నాడు. పలు ప్రాంతాల్లో ఫలక్‌నుమా దాస్ సినిమా పోస్టర్లను, ఫ్లెక్సీలను, యాడ్స్‌ను చింపి, పగలగొట్టినట్టు ఆయన పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన చిత్రాలను మీడియా దృష్టికి తీసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











