twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ బర్త్ డేకు రూ. 2 వేల కోట్ల బ్లాక్ మనీ వైట్‌గా అంటూ...

    |

    జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం చర్చనీయాంశం అయింది. తన పుట్టినరోజున పవన్ కళ్యాణ్ దాదాపు రూ. 2 వేల కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారనే రూమర్స్ తెరపైకి వచ్చాయి.

    పుట్టినరోజు సందర్భంగా గిఫ్టులు, ఇతరత్రా రూపంలో బయటి వ్యక్తుల ద్వారా బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆ వార్తల సారాంశం. నిన్నమొన్నటి వరకు ఈ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోని జనసేన పార్టీ దీన్ని ఇలాగే వదిలేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండటంతో వెంటనే అప్రమత్తం అయింది.

    ఫ్యాన్స్ హ్యాపీ మూడ్లో ఉండగా...

    ఫ్యాన్స్ హ్యాపీ మూడ్లో ఉండగా...

    1971లో జన్మించిన పవన్ కళ్యాణ్ వచ్చే సెప్టెంబర్ 2తో 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు గ్రాండ్‌గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంతా హ్యాపీ మూడ్లో ఉండగా సోషల్ మీడియాలో మొదలైన బ్లాక్ మనీ, వైట్ మనీ ప్రచారం వారిని విస్మయం చెందేలా చేసింది.

    తప్పుడు ప్రచారం చేస్తున్నది వారే...

    తప్పుడు ప్రచారం చేస్తున్నది వారే...

    సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించారు ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్. తమ అధినాయకుడిపై కావాలనే చెడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీ ద్వారా ఈ అసత్య ప్రచారం జరుగుతోందని, దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

    దుష్ర్పచారం చేస్తే సహించేది లేదు

    దుష్ర్పచారం చేస్తే సహించేది లేదు

    పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ స్పందిస్తూ... తమ పార్టీపైకానీ, అధ్యక్షుడిపై కానీ ఇలాంటి దుష్ర్పచారం జరిగితే సహించేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఏదైనా తప్పుడు ప్రచారం కనిపిస్తే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు.

    ఈ సారి కూడా దద్దరిల్లడం ఖాయమేనా?

    ఈ సారి కూడా దద్దరిల్లడం ఖాయమేనా?

    గతేడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భగా సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. అభిమానులు, సినీ స్టార్లు, పొలిటీషియన్లు ఆయన్ను విష్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. అయితే ఈ సారి కూడా అదే స్థాయిలో పవర్ స్టార్ పుట్టినరోజును ఫ్యాన్స్ సెలబ్రేట్ చేయబోతున్నారు.

    English summary
    Representatives of the Janasena Party have complained to the cybercrime police that Jana Sena chief Pawan Kalyan has been misrepresented on social media and demanded immediate action.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X